యాత్రిగన్ కృపయా ధ్యాన్ దే: రైల్వే ప్రయాణికులకు సమ్మర్ గిఫ్ట్..ఈ మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్

భారతీయుల జీవనాడి అంటే రైల్వేను చెప్పవచ్చు. వారి జీవితాలతో రైళ్లు విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకుంటాయి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఉన్న రైళ్లు సరిపోవు. దీంతో దక్షిణ మధ్య రైల్వే 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి? ఏయే తేదీల్లో ఏ స్టేషన్ల నుంచి అందుబాటులో ఉంటాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Train No.08585: విశాఖపట్నం-మహబూబ్ నగర్ మధ్య ఈనెల 2వ తేదీ నుంచి జూన్ 27 వరకు ఇది నడుస్తుంది. ప్రతి మంగళవారం 17.35 గంటలకు బయలుదేరి మరుసటిరోజు 10.30 గంటలకు తన గమ్యాన్ని చేరుకుంటుంది.

railway passengers.

No.08586: మహబూబ్ నగర్-విశాఖపట్నం ప్రత్యేక రైలు ఈ నెల 3వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు నడవనుంది. ఈ రైళ్లు ఆయా తేదీల్లో ప్రతి బుధవారం 18.20 గంటలకు బయలుదేరి.. తర్వాతరోజు 09:50 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటాయి.

No.08583: విశాఖపట్నం-తిరుపతి ప్రత్యేక రైలు ఈ నెల 1 నుంచి జూన్ 26వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ప్రతి సోమవారం 19.10 గంటలకు బయలుదేరి.. తర్వాత రోజు ఉదయం 9.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

No.08584: తిరుపతి-విశాఖపట్నం ప్రత్యేక రైలు మే 2వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం 21.55 గంటలకు బయలుదేరి.. తర్వాతరోజు ఉదయం 10.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

No.08543: విశాఖపట్నం-బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైలు ఈ నెల 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నడవనుంది. ఈ ట్రైన్ ప్రతి ఆదివారం 15.55 గంటలకు బయలుదేరి.. తర్వాతరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

No.08544: బెంగళూరు కంటోన్మెంట్-విశాఖపట్నం ట్రైన్ ను ఈ నెల 8 నుంచి 29 వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో ప్రతీ సోమవారం 15.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 13.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

No.08585/08586 విశాఖపట్నం-మహబూబ్ నగర్-విశాఖపట్నం రైళ్లు దువ్వాడ, సామర్లకోట, ఏలూరు, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజ్ గిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతాయి.

railway passengers.

No.08583/08584: విశాఖటప్నం-తిరుపతి-విశాఖపట్నం రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.

No.08543/08544 విశాఖపట్నం-బెంగళూరు కంటోన్మెంట్-విశాఖపట్నం రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కుప్పం, బంగారపేట్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+