నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్పోర్ట్స్ కోటాలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం మరో తీపి కబురు ప్రకటించింది. క్రీడా కోటాలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తగిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇవ్వనున్నారు. మొత్తం 421 పోస్టులను భర్తీ చేయనున్నట్టు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు మే 2 నుంచి ప్రారంభం కానుండగా.. మే 31తో గడువు ముగుస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
సంస్థల వారీగా ఖాళీలు..

జిల్లాల వారీగా స్పోర్ట్స్ కోటా పోస్టుల వివరాలు..
శ్రీకాకుళం జిల్లా - 16
విజయనగరం జిల్లా - 10
విశాఖపట్టణం జిల్లా - 32
కృష్ణా జిల్లా - 34
గుంటూరు జిల్లా - 33
ప్రకాశం జిల్లా - 20
నెల్లూరు జిల్లా - 17
తూర్పుగోదావరి జిల్లా - 38
పశ్చిమగోదావరి జిల్లా - 29
వైఎస్ఆర్ కడప జిల్లా - 20
కర్నూలు జిల్లా - 73
చిత్తూరు జిల్లా - 41
అనంతపురం జిల్లా - 22
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా.. ఈ నెల 15 వరకు దరఖాస్తులు కొనసాగనున్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు కూడా అప్లై చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications