తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. ఆ స్టేషన్ లోనూ ఆగనున్న సూపర్ ఫాస్ట్ రైలు!
దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి భారతీయ రైల్వేలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధునాతన రైలు మార్గాలను, నూతన రైళ్ళను, అత్యాధునికంగా రైల్వే స్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టి, ఎక్కడికక్కడ కొత్త హాల్టింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారి ప్రజలకు రైళ్లు అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తోంది.
తిరుమలకు వెళ్లాలనుకునేవారి కోసం రైల్వే నిర్ణయం
ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వారికి తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి రైల్వే చేస్తున్న కృషి నిరుపమానం. అటువంటి రైల్వే విస్తరణలో భాగంగా వివిధ ప్రాంతాల ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో తిరుమల తిరుపతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా చెప్పే తిరుమల వెళ్లాలని హిందువులందరూ కోరుకుంటారు.

రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు కొత్త స్టాపేజీ
అటువంటి తిరుమలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి రైళ్లు ఉన్నాయి. ఇక తిరుమలకి వెళ్లే భక్తుల అవసరాలు తీర్చడానికి ప్రతిరోజు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, వందే భారత్ వంటి రైళ్లు సేవలను అందిస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా దక్షిణ మధ్య రైల్వే నిజామాబాద్- తిరుపతి మధ్య నడిచే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు కొత్త స్టాపేజీని ప్రకటించింది.
తిరుమల రైలు కోసం పెద్దఎత్తున ప్రజల డిమాండ్
చాలాకాలంగా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నట్టు వికారాబాద్ జిల్లాలోని నవాండ్గి రైల్వేస్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ను ప్రయోగాత్మకంగా ఆపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి ఏ. శ్రీధర్ తెలిపారు. ఇది ఈ మార్గంలో ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఎప్పటినుంచో ఇక్కడి ప్రజలు తిరుమల రైలు కోసం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆ స్టేషన్ లోనూ రాయలసీమ ఎక్స్ ప్రెస్
రాయలసీమ ఎక్స్ ప్రెస్ తెల్లవారుజామున 2 గంటల 54 నిమిషాల నుండి, 2 గంటల 55 నిమిషాల మధ్య ఒక్క నిమిషం పాటు నవాండ్గి రైల్వే స్టేషన్లో ఆగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదనపు స్టాపేజీలో ఏర్పాటుతో రైల్వే మరింత ప్రజలకు చేరువవుతుంది. అన్ని ప్రాంతాల వారు రైళ్ల ద్వారా ప్రయాణం చేయడానికి ఆసక్తిని కనపరచడానికి సాధ్యపడుతుంది. ముఖ్యంగా తిరుమలకు వెళ్లాలనుకునే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications