తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
ఏడుకొండలపై కొలువైవున్న శ్రీ వేంకటేశ్వరుణ్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ప్రతిరోజు తిరుమలకు తండోప తండాలుగా వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి రావడంవల్ల దగ్గరలో ఉండే అన్ని సందర్శనీయ స్థలాలను దర్శించుకోవాలనుకున్నప్పటికీ ద్విచక్ర వాహనం అందుబాటులో లేకపోవడం, జీపులు, టాక్సీలు ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తుండంతో ఆ ప్రయత్నాలను కొంతమంది విరమించుకుంటుంటారు.
అటువంటి భక్తుల కోసం తిరుపతిలోని హాథీరాం ట్రావెల్స్ వారు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన రైల్వేస్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర కొత్త బైకులను భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. 24 గంటల సమయానికి రూ.600 తీసుకుంటున్నారు. పెట్రోలు ఖర్చు భక్తులదే. శ్రీవారి భక్తులకు మంచి సర్వీసు ఇవ్వాలన్న ఉద్దేశంతో అన్నీ కొత్త బైకులనే తెచ్చారు. వీటికి సంబంధించిన బండి కాగితాలు, ఇన్సూరెన్స్ కూడా పర్ ఫెక్ట్ గా ఉంటాయి. డిక్కీలోనే హెల్మెట్ ఉంచుతున్నారు.

వీటికి జీపీఎస్ సిస్టం అమర్చారు. దీనివల్ల ఎక్కడైనా బండిని పార్కింగ్ చేసినప్పుడు అది ఉంటుందా? పోతుందా? అనే భయం కూడా అక్కరలేదు. వీటిద్వారా ఆకాశగంగ, పాప వినాశనం, కపిల తీర్థం, అలిపిరి, చంద్రగిరి కోట, గోవిందరాజులస్వామి దేవాలయం, శ్రీ కాళహస్తి దేవాలయం, జాబాలి, వేణుగోపాలస్వామి గుడి, రూమ్స్ దగ్గరకు తిరగడానికి, పద్మావతి అమ్మవారి ఆలయం, మ్యూజియం, హోటల్స్, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, జూ పార్క్, వకుళమాత గుడి, శ్రీనివాస మంగాపురం, శ్రీవారి నమూనా ఆలయం, ఇస్కాన్ టెంపుల్, కోదండరామస్వామి ఆలయం.. ఇలా అన్నింటినీ దర్శించిన తృప్తితో తిరుమల ప్రయాణాన్ని శుభప్రదంగా ముగించవచ్చు.












Click it and Unblock the Notifications