జల్లంత కబురు.. నైరుతి రుతుపవనాల రాక, తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ గుడ్ న్యూస్!!

మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు, రైతులకు శుభవార్త చెప్పారు భారత వాతావరణ శాఖ అధికారులు. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని, వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి సకాలంలో దేశమంతా విస్తరించి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఈ సంవత్సరం ఆశించిన దాని కంటే ఎక్కువ వర్షాలు కురిసే కారణంగా రైతన్నలకు మేలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది.

ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
గత సంవత్సరం నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. సరిపడిన వర్షపాతం లేక తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉండబోదని విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో మే 19వ తేదీన ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా కదులుతున్నాయని పేర్కొంది.

Good news on rains Arrival of Southwest Monsoon IMD says huge rainfall for Telugu states

కేరళకు.. ఆపై ఏపీకి, తర్వాత తెలంగాణాకు.. ఋతుపవనాల ప్రయాణం ఇలా
మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయని అక్కడి నుండి దక్షిణ భారతదేశంలో ఉత్తరం వైపు పయనిస్తాయని చెబుతున్నారు. ఈసారి జూన్ 1, 2వ తేదీలలో నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించనున్నాయి. ఒకవేళ ఏదైనా ఆలస్యం జరిగినా మరుసటి రోజు అంటే రెండు, మూడు తేదీలకు ఏపీలోకి ప్రవేశిస్తాయి. ఆపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం ఐదు ఆరు రోజులు సమయం పడుతుంది.

ఏపీ,తెలంగాణాలో జూన్ రెండో వారానికి విస్తారంగా వర్షాలు
జూన్ 5 నుంచి 8 తేదీల మధ్య తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాస్త జాప్యం జరిగిన జూన్ రెండో వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విస్తారంగా వర్షాలు వస్తాయని చెబుతున్నారు. రెమాల్ తుఫాన్ కూడా బంగ్లాదేశ్ వైపుకు మరలిపోవడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడానికి అనువైన వాతావరణ ఏర్పడిందని చెప్తున్నారు.

ఈ వర్షాకాలం సాధారణం కంటే ఎక్కువ వానలు
ఇది సకాలంలో తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినట్లయితే రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ సారి జూన్ నెలలో సాధారణ వర్షపాతాన్ని మించి వర్షాలు నమోదు అవుతాయని చెబుతున్నారు. జూన్ మాసమే కాదు సెప్టెంబర్ నెల వరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురవనుందని భావిస్తున్నారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సరాసరి వర్షపాతం 87% అయితే 107% దాటి వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+