గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు!
ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం పశ్చిమ దేశాలలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ మరియు చమురు కొరతకు దారి తీసింది. ముఖ్యంగా భారతదేశంలో కూడా ఎల్పిజి, చమురు సమస్య ఉత్పన్నమైంది. ఈ పరిస్థితుల నుండి బయటపడటానికి ప్రభుత్వం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోంది.
విశాఖ తీరానికి చమురు, ఎల్పీజీ నౌకలు
ఇరాన్లోని చమురు క్షేత్రాల పైన దాడులు చేయడం, హార్మూజ్ జలసంధి నుంచి నౌకలు రాకపోవడం వంటివి ఈ ప్రధాన సమస్యకు కారణమని తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరానికి రావలసిన నౌకలు కూడా రాకపోవడంతో ఏపీలో ఆయిల్ మరియు ఎల్పీజీ సమస్య తీవ్రతరమవుతుంది అని, ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలని భావించిన తరుణంలోనే ఊరట ఇస్తూ విశాఖకు ఎల్పిజి మరియు చమురు నౌకలు చేరుకున్నాయి.

విశాఖకు వచ్చిన, రానున్న ఎల్పీజీ, చమురు నౌకలివే
మార్చి 26వ తేదీన 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో బి డబ్ల్యు బ్రిచ్ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది. అది ఈరోజు అన్లోడ్ అవుతుంది. ఇక ఈనెల 30వ తేదీన నెదర్లాండ్స్ నుంచి హెల్లాస్ గ్లాడియేటర్, అమెరికా రెడ్డి జూపిటర్ నౌకలు రానున్నాయి 'లుపినస్' (22 టీఎంటీ), 'ఏఐ వుకిర్' (26 టీఎంటీ) నౌకలు గత నెల, ఈ నెలలో యూఏఈ, ఖతార్‌ల నుండి ఇప్పటికే వచ్చాయి.
ఈ వారంలో మరిన్ని నౌకల రాక
ఇదిలా ఉంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు చెందిన 'ఎంవీ సమర్ శృతి' నౌక ప్రస్తుతం విశాఖ పోర్టులో 65 వేల టన్నుల డీజిల్‌ను అన్‌లోడ్ చేస్తోంది. 'ఎంవీ స్వర్ణ సింధు' క్రూడ్ ఆయిల్ నౌక మరో రెండు రోజుల్లో రానుంది. ఇక రష్యా నుంచి 1,36,728 టన్నుల ముడి చమురుతో జంబో నౌక శుక్రవారం విశాఖకు చేరుకోనుంది.
ఈ నెలలో ఇప్పటికి పది చమురు నౌకలు విశాఖకు
వచ్చేనెల 2, 5 తేదీల్లో 'ఫౌండేయ' (రష్యా నుంచి), 'దేశ్ గౌరవ్' (ముంద్రా పోర్టు) నౌకలు ముడి చమురుతో రావలసి ఉంది. ఈనెల 1 నుంచి 25 మధ్య ఇరాక్, రష్యా, ఖతార్, యూఏఈ, భారత దేశంలోని పలు పోర్టుల నుంచి పది చమురు నౌకలు విశాఖకు చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు చమురు నౌకలు ఒకటొకటిగా చేరుకుంటూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక ఇతర పోర్టుల్లోనూ రద్దీ ఉంది.
మంగళూరు, చెన్నై పోర్ట్ లకు నౌకలు
40 వేల టన్నుల ఎల్‌పీజీతో 'అపోలో ఓషియన్' గురువారం న్యూ మంగళూరుకు చేరుకుంది. రష్యా నుంచి లక్ష టన్నుల ముడి చమురుతో మూడో నౌక చెన్నై హార్బర్‌కు గురువారం వచ్చి చేరింది. మరొకటి శనివారం వస్తుంది. న్యూ మంగళూరుకు మరో రెండు ముడి చమురు నౌకలు త్వరలో రానున్నాయి.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications