విజయవాడ ఎయిర్ పోర్టుకు మహర్దశ-బాలశౌరి ప్రశ్నకు రామ్మోహన్ హామీ..!

ఏపీలో రాజధాని అమరావతికి కీలకమైన విజయవాడ ఎయిర్ పోర్టుకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి రాజధాని ప్రకటన తర్వాత గన్నవరంలో ఎయిర్ పోర్టు కాస్తా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారింది. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రాకతో ఎయిర్ పోర్టును పట్టించుకునే వారే కరువయ్యారు. తిరిగి కూటమి ప్రభుత్వం రాకతో అభివృద్ధి పనులు, విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

అయితే విజయవాడ ఎయిర్ పోర్టులో అభివృద్ధి పనులను వేగవంతం చేయటంతో పాటు దేశంలోని పలు నగరాలతో కనెక్టివిటీ విషయంలో ఇవాళ పార్లమెంట్ లో బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్న అడిగారు. దీనికి పౌర విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. విజయవాడ ఎయిర్ పోర్టులో పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

good news to Vijayawada airport civil aviation minister reply to Machilipatnam mp in parliament

విజయవాడ విమానాశ్రయంలో..కొత్త ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం ఆలస్యం అవుతుందన్న బాలశౌరి ప్రశ్నకు.. ఆలస్యానికి పర్యావరణ అనుమతులే కారణమన్నారు. ఇప్పటివరకు 48.5 శాతం పనులు పూర్తయ్యాయని, గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి..అనేక అవరోధాలు ఉన్నాయన్నారు. అయితే వాటిని అధిగమిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరోవైపు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్, థాయ్ లాండ్, శ్రీలంకకు విదేశాలకు వెళ్లేలా విమాన సర్వీసులు, విజయవాడ నుంచి వారణాసి, కలకత్తా, తిరుపతికి నూతన సర్వీసులను, ఢిల్లీ-వైజాగ్ కనెక్టివిటీ ఫ్లైట్ సర్వీసులను తీసుకురావాల్సిన అవసరం ఉందని బాలశౌరి కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+