వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేది ఆరోజే

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ రైలు త్వరలో పట్టాలెక్కబోతోంది. వీటిని సాధ్యమైంతన త్వరగా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లకు సిట్టింగ్ సర్వీసే ఉంది. స్లీపర్ బోగీలతో ఆగస్టు 15వ తేదీన ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీన్ని ప్రారంభించనున్నారు.

గంటకు 220 కిలోమీటర్ల వేగానికి పెంచుతారు
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులో జరుగుతున్న స్లీపర్‌ రైలు పనులను పర్యవేక్షించారు. రైలు తయారీ చివరిదశలో ఉందని మంత్రి వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా పట్టాలెక్కబోతున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఢిల్లీ-ముంబయి మధ్య నడవనుందని చెప్పారు. ఢిల్లీ నుంచి భోపాల్, సూరత్ మీదగా ముంబయి చేరుకుంటుంది. ఇందులో మొత్తం 16 బోగీలుంటాయి. అందులో 10 బోగీలు థర్డ్ ఏసీ, నాలుగు బోగీలు సెకండ్ ఏసీ, ఒక బోగీని మొదటి ఏసీకి కేటాయించారు. సీటింగ్‌తో పాటు లగేజీ(SLR) కోసం రెండు బోగీలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం దీన్ని గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు. తర్వాత గంటకు 160 నుంచి 220 కిలోమీటర్ల వేగానికి పెంచుతారు.

good news Vande Bharat sleeper train will start august 15th

టికెట్ ధరలపై విమర్శలు
వందేభారత్ ఛైర్ కార్ రైళ్లల్లోనే టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్న స్లీపర్ రైలు టికెట్ ధరలు మరింత ఎక్కువగా ఉంటాయని ప్రయాణికులు భయపడుతున్నారు. విమానం టికెట్ ధరలతో సమానంగా, మరికొన్నిచోట్ల విమానం ధరకన్నా ఎక్కువుగా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వంకానీ, రైల్వే అధికారులుకానీ ధరలు తగ్గించే విషయమై ఏమీ మాట్లాడటంలేదు. దీంతో వాటి ధరలు తగ్గించరని ఖాయమైంది. అయితే పూర్తి నాన్ ఏసీ బోగీలతో వందే సాధారణ్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. వీటిల్లో అన్నీ నాన్ ఏసీ బోగీలతోపాటు టికెట్ ధరలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+