సీఎం జగన్ కు కలిసిరాని 3 అంకె.. మాడు పగిలేందుకేనన్న టీడీపీ.. డీజీపీకి చంద్రబాబు లేఖ..
ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల వ్యాప్తిని మరింత వేగవంతం చేశారు. కానీ విధాన నిర్ణయాలు, ఇంకొన్ని కీలక మార్పుల విషయంలో మాత్రం వివిధ రూపాల్లో తీవ్రమైన ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. పంచాయితీ భవనాలకు రంగుల దగ్గర్నుంచి రాజధాని మార్పు దాకా పలు అంశాల్లో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు తగిలాయి. దీన్ని అంకెతో ముడిపెడుతూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తమ నేతల భద్రత విషయంలో చంద్రబాబు, నారా లోకేశ్ సైతం సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడుతో మాడు పగులు..
జగన్ అధికారంలోకి వస్తూనే పంచాయితీ భవనాలకు మూడు రంగులు వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రతి మనిషికి మూడేసి మాస్కులు అందిస్తామని చెప్పడం తెలిసిందే. ఈ మూడు అంశాల్లోనూ వైసీపీ సర్కారు దారుణంగా ఫెయిలైందని, చూడబోతే మూడుతో మాడు పగిలినట్లుందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు.

చివరికి మిగిలిందిదే..
‘‘మూడు మాస్కులు అన్నారు.. కానీ క్వాలిటీ లేకపోయే. మూడు రాజధానులు అన్నారు.. దానిపై ఇంకా క్లారిటీ లేకపోయే. బిల్డింగ్ లకు మూడు రంగులు అన్నారు.. చివరికి ఒక రంగు మాత్రమే మిగిలింది. మొత్తానికి ఈ మూడు అంకె ఉన్నది వైసీపీ ప్రభుత్వానికి మాడు పగిలేందుకే అనుకుంటా'' అని బుచ్చయ్య ఘాటు సెటైర్ వేశారు. బుధవారం కడియం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించారు. ఇదిలా ఉంటే..

వర్ల భద్రతపై బాబు ఆందోళన..
టీడీసీ నేత వర్ల రామయ్యకు వన్ ప్లస్ వన్ భద్రత తొలగిస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు తప్పుపట్టారు. అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ నేతలపై సర్కారు కక్షకట్టిందని ఆరోపించారు. రామయ్యకు వెంటనే సెక్యూరిటీ పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు బుధవారం లేఖ రాశారు. వర్ల మాజీ ఐపీఎస్ కావడంతో గత ప్రభుత్వాలన్నీ వన్ ప్లస్ వన్ భద్రత కొనసాగించాయని, ప్రస్తుత సర్కారు అందుకు విరుద్ధంగా వెళుతుండటం సరికాదని బాబు లేఖలో పేర్కొన్నారు.

మూల్యం తప్పదు..
వర్ల రామయ్య భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేయగా, టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై నారా లోకేశ్ స్పందించారు. ఈఎస్ఐ స్కామ్ కేసుల అరెస్టయిన అచ్చెన్న బుధవారం విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. పైల్స్ ఆపరేష్ చేయించుకున్న అచ్చెన్న పట్ల సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని, అన్నింటికీ మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.
Recommended Video

బలవంతపు డిశ్చార్జ్..
అన్ని పరీక్షలు నిర్వహించకముందే తనను డిశ్చార్జ్ చేయడమేంటని ప్రశ్నిస్తూ.. జీజీహెచ్ సూపరింటెండెంట్ కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఇదే విషయాన్ని నారా లోకేశ్ ప్రస్తావిస్తూ.. ‘‘ అచ్చెన్నన్ను బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆపరేషన్ అయిన వ్యక్తిని 24 గంటలు రోడ్ల పై తిప్పి రెండోసారి ఆపరేషన్ కి కారణం అయ్యారు. ఇప్పుడు గాయం మానక ముందే డాక్టర్ల పై ఒత్తిడి చేసి డిశ్చార్జ్ చేసారు. చేస్తున్న ప్రతీ తప్పుకి జగన్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకోక తప్పదు'' అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications