Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ కత్తి చూస్తే కొందరికి ఆనందం.. కోడికత్తిపై పోస్ట్ పెట్టి జగన్ టార్గెట్ గా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య సందర్భం ఏదైనా సరే మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు టిడిపి నేతలు. గుడివాడలో కేసినో కల్చర్ అంటూ చంద్రబాబు పండుగలు, సాంప్రదాయాలు వైసీపీ హయాంలో మంటగలిసి పోతున్నాయని విమర్శలు గుప్పిస్తుంటే, టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా కోడిపందాలను, కోడి కాళ్ళకు కట్టే కత్తులను వాటితో కొందరికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కోడి కత్తిపై గోరంట్ల బుచ్చయ్య షాకింగ్ కామెంట్స్

కోడి కత్తిపై గోరంట్ల బుచ్చయ్య షాకింగ్ కామెంట్స్

తాజాగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంక్రాంతికి కోడిపందెం అనేది ప్రత్యేకత. కానీ కొంత మందికి దానికి కట్టే కత్తి చూస్తే ఆనందం వస్తుంది అంటూ సెటైర్లు వేశారు. ఇక వారికి ఆ కత్తి గుచ్చుకుంటే గుచ్చుకున్న కోడి ఓడిపోతుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అంతేకాదు కానీ కొంత మందికి అది గుచ్చుకుంటే విజయం సాధిస్తారు! అంటూ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో both are not same.. రెండూ ఒకటి కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

కోడి కత్తి అంటూ జగన్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతలు

కోడి కత్తి అంటూ జగన్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతలు


ఈ వ్యాఖ్యల ద్వారా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో జగన్ పై జరిగిన కోడి కత్తి దాడిని, కోడి కత్తి దాడి సమయంలో జగన్ నవ్వుతూ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసినట్లుగా తెలుస్తుంది. అంతే కాదు కోడి కత్తి గుచ్చుకోవటం వల్లే జగన్ సీఎం అయినట్టుగా ఆయన సెటైర్లు వేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోడి కత్తి విషయాన్ని ఎప్పుడూ మాట్లాడిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనేది వాస్తవం . ఈ క్రమంలోనే తాజాగా టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా జగన్ ను టార్గెట్ చేసే ఈ పోస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.

భూమి గుండ్రంగా ఉంటుందని వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలన్న టీడీపీ ఎమ్మెల్యే

భూమి గుండ్రంగా ఉంటుందని వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలన్న టీడీపీ ఎమ్మెల్యే


ఇక ఇదే సమయంలో ప్రభుత్వం రాజకీయ కక్షలకి పాల్పడడం హేయమైన చర్య అని పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి నీచమైన రాజకీయం, సాంస్కృతిక విధానంలో వైసీపీ ప్రభుత్వం వెళ్తుందని పేర్కొన్నారు . ప్రజలు అభివృద్ధి చేయమని అధికారమిస్తే అరాచకాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో భూమి గుండ్రంగా ఉంటుందనే విషయాన్ని వైసిపి వాళ్ళు గుర్తుంచుకోవాలి అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తేల్చి చెప్పారు. ఫెయిల్ అయిన సీఎం జగన్ అంటూ ట్యాగ్ చేసి మరీ జగన్ ను టార్గెట్ చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

లోకేష్ కరోనా నుండి కోలుకోవాలి : గోరంట్ల ఆకాంక్ష

లోకేష్ కరోనా నుండి కోలుకోవాలి : గోరంట్ల ఆకాంక్ష

అంతేకాదు తాజాగా నారా లోకేష్ కరోనా మహమ్మారి బారిన పడిన అంశంపై స్పందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ కరోనా నుండి త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టాలని ఆశిస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. లోకేష్ త్వరగా కోలుకోవాలని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆకాంక్ష వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+