Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

YSRCP : యువజన శృంగార రసిక చిలిపి పార్టీ- వైసీపీకి కొత్త అర్ధం చెప్పిన బుద్ధా వెంకన్న- ..

ఏపీలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ రాజకీయంగా కలకలం రేపుతోంది. నిన్న ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఛాట్ వైరల్ కావడంతో దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. దీంతో వైసీపీ కూడా ఇరుకునపడుతోంది. మాధవ్ వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవని వైసీపీ నేత సజ్జల కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మాధవ్ పై సస్పెన్షన్ కు ఒత్తిడి పెంచుతున్న టీడీపీ నేతలు.. తాజాగా వైసీపీని టార్గెట్ చేశారు.

వైసీపీలో రాసలీలల ఎపిసోడ్స్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు. వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి శివ‌కుమార్ నుంచి ముందుగా లీజుకి తీసుకుని ఆ త‌రువాత పూర్తి యాజ‌మాన్య హ‌క్కులు సంపాదించిన‌ యువ‌జ‌న శృంగార ర‌సిక చిలిపి పార్టీ పేరుని సార్థ‌కం చేసే మ‌రో ట్రెండ్ సెట్ట‌ర్ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ అంటూ బుద్ధా ట్వీట్ చేశారు. వైఎస్సార్సీపీ ఆశీస్సుల‌తో ఇప్ప‌టివ‌ర‌కూ అవంతి అరగంట స‌ర‌సం, అంబ‌టి గంట విర‌హం ఆడియోలు బ‌య‌ట‌కొస్తే..వారిపై జ‌గ‌న్‌రెడ్డి ఏం చ‌ర్య‌లు తీసుకోలేదన్నారు.

gorantla madhav nude episode-tdps budha venkanna new definition to ysrcp with satires

అంతటితో ఆగకుండా ..పార్టీ బ్రాండింగ్ అయిన ఇటువంటి రాస‌లీల‌లు చేయ‌డం కాదు, బ‌య‌ట‌పెట్టుకుంటేనే అధినేత గుర్తిస్తున్నార‌ని ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్‌గా మ‌హిళ‌ని సెక్సువ‌ల్ హెరాస్ చేస్తూ వీడియో వ‌దిలారని, ఇప్పుడు ఎంపీపై చ‌ర్య‌లు తీసుకుంటారో, అంబ‌టిలా ప‌ద‌వి ఇచ్చి గౌర‌విస్తారో చూద్దామంటూ బుద్ధా వెంకన్న తన ట్వీట్ లో పేర్కొన్నారు.

gorantla madhav nude episode-tdps budha venkanna new definition to ysrcp with satires

వైసీపీ నేత‌లు మ‌ద‌మెక్కిన ఆంబోతుల్లా ఊరిమీద ప‌డి మ‌హిళ‌ల మాన‌ప్రాణాలు తీస్తుంటే...వారిపై క‌నీస చ‌ర్య‌లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి తీసుకోవ‌డంలేదని మరో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మ‌హిళ‌లపై లైంగిక‌దాడుల‌కి పాల్ప‌డిన‌వారికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారన్నారు. వైకామ‌కేయుల్ని ఊరి మీదకి వ‌దిలి దిక్కులేని దిశ‌చ‌ట్టం తెచ్చారు. మ‌హిళ‌ల‌కి ఇంకెక్క‌డి ర‌క్ష‌ణ‌? అని ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+