గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో రచ్చ; టీడీపీ, జనసేన నేతలపై వైసీపీ మహిళానేత ఫిర్యాదు
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కి సంబంధించిన న్యూడ్ వీడియో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రచ్చ చేస్తోంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. ఆయనను ఎంపీగా తొలగించాలని పెద్ద ఎత్తున జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది. ఇక ఈ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరుపుతున్నట్లుగా వెల్లడించి, నిజమని నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన చేసింది.

ఎంపీ గోరంట్ల అశ్లీల వీడియోలో తన ఫోటో మార్ఫ్ చేశారంటూ వైసీపీ మహిళానేత ఫిర్యాదు
ఇక తాజాగా ఈ వ్యవహారంలో ఎంపీ గోరంట్ల మాధవ్ కి సంబంధించిన న్యూడ్ వీడియోలో తన ఫొటోలను మార్ఫింగ్ చేశారంటూ ఓ వైసీపీ మహిళా నేత పోలీసులను ఆశ్రయించారు. కద్రి ప్రాంతంలోని గాండ్లపెంట కు చెందిన వైయస్సార్సీపి సోషల్ మీడియా వాలంటీర్ అనిత రెడ్డి ఈ వీడియోపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఫోటో మార్ఫింగ్ వెనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ లు ఉన్నాయంటూ ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఐదుగురు వ్యక్తుల పై గాండ్లపెంట కు చెందిన వైయస్సార్సీపి సోషల్ మీడియా వాలంటీర్ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు రోజులుగా రచ్చ చేస్తున్న గోరంట్ల మాధవ్ కి సంబంధించిన వీడియో వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఆ వీడియోలో తన ఫోటోను ఉపయోగించి తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారని, ఐదుగురు వ్యక్తుల పై కద్రి ప్రాంతంలోని గాండ్లపెంట కు చెందిన వైయస్సార్సీపి సోషల్ మీడియా వాలంటీర్ అనితారెడ్డి ఫిర్యాదు చేశారు. తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటానని, అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను హైలెట్ చేస్తున్న కారణంగా తనను టార్గెట్ చేశారని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనను మానసికంగా వేధిస్తున్నారంటూ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
వీడియోలో తన ఫోటోను మార్ఫ్ చేసి తనను మానసికంగా వేధిస్తున్నారంటూ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసభ్యంగా సోషల్ మీడియాలో తనపై పోస్టులు పెడుతున్నారంటూ ఆమె పేర్కొన్నారు. తాను జరుగుతున్న రచ్చతో సమాజంలో ఇబ్బంది పడుతున్నానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో... మార్ఫింగ్ రగడ ..
ఇదిలా ఉంటే ఇప్పటివరకూ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కి సంబంధించి అది మార్ఫింగ్ జరిగిందా లేదా అన్నది స్పష్టత రాలేదు. ఇక ఈ కేసులో ప్రతిపక్షాలు పెద్దఎత్తున వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో, మహిళల పట్ల వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చేస్తున్న విమర్శలతో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ కేసులో వాస్తవాలు వెల్లడించాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఇక ఇప్పుడు వీడియో విషయంలో టీడీపీ, జనసేన నేతలపై వైసీపీ మహిళా సోషల్ మీడియా వాలంటీర్ ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications