హైదరాబాద్ TO విశాఖ, అరకు.. IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో ఏదైనా టూర్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? ఇప్పటికే మీకు దగ్గరలోని, చుట్టుపక్కల పర్యటక ప్రాంతాలను సందర్శించారా..? అయితే ఏపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు అయిన విశాఖపట్నం, అరకు ప్రాంతాలను చుట్టేయాలని ఉందా..? ఈ వేసవిలో విశాఖ, అరకు ప్రాంతాలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. పర్యటకులకు మరచిపోలేని అనుభూతిని అందిస్తాయి. మరింకెందుకు ఆలస్యం మీరూ వైజాగ్, అరకు అందాలను చూడాలని ఉందా.. మీకోసం భారతీయ రైల్వే శాఖ సూపర్ ఆఫర్ తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలోనే ఈ ప్రాంతాల్ని సందర్శించే అవకాశాన్ని కల్పించింది.

IRCTC అందిస్తున్న ఈ అద్భుతమైన ప్యాకేజీలో భాగంగా విశాఖపట్నం, అరకు పర్యటక ప్రాంతాలతోపాటుగా విశాఖపట్నంలోని బీచ్ లు, ఆలయాలు, మ్యూజియం, సింహాచలం ఆలయం అలాగే బొర్రా గుహలను సందర్శించే అవకాశం ఉంది. ఇక ఈ ప్యాకేజీ పైరు జువెల్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు. ఇక యాత్ర ఎలా సాగుతుంది అంటే తొలిరోజు హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటలకు రైలు ప్రారంభం అవుతుంది. అలా రాత్రంతా ప్రయాణం జరుగుతుంది.

రెండోరోజు ఉదయం 6 గంటల వరకు రైలు విశాఖపట్నం చేరుకుంటుంది. ఐఆర్సీటీసీ సిబ్బంది పర్యటకుల్ని పికప్ చేసుకుని హోటల్ కు తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెషప్ అయిన తర్వాత కాళీ మాతా మందిరం, సబ్ మెరైన్ మందిరం సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కైలాసగిరి హిల్స్, రిషికొండ బీచ్ ను సందర్శిస్తారు. మూడోరోజు పద్మావతి గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. ఆ తర్వాత బొర్రా గుహలను సందర్శిస్తారు. నాలుగోరోజు ఉదయం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆర్ కే బీచ్ లో సందర్శన ఉంటుంది. నాలుగోరోజు సాయంత్రం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు రైలు ఉంటుంది. రాత్రంతా జర్నీ తర్వాత ఐదోరోజు ఉదయం హైదరాబాద్ స్టేషన్ కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

Hyderabad to Visakhapatnam Araku Amazing IRCTC Tour Package Explore Beaches Hills amp amp Scenic Beauty

ఇక ఈ యాత్రకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఐఆర్​సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్ కార్యాలయాన్ని సంప్రదించొచ్చు. అలాగే 8287932229, 9701360701 నంబర్ లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+