ఇంటికొచ్చి కాళ్లు విరగ్గొడుతా: ఆ మంత్రికి మహిళా నేత వార్నింగ్
పలాస రాజకీయం రసవత్తరంగా మారింది. మంత్రి సీదిరి అప్పలరాజు వర్సెస్ మాజీ టిడిపి ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నట్టు అక్కడ రాజకీయం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య పలాసలో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది. అది ఇప్పుడు పీక్స్ కి చేరుకుని ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునేదాకా, దాడులు చేసుకునేదాకా, హెచ్చరికలతో రచ్చ చేసేదాకా వెళ్ళింది.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మంత్రి అప్పలరాజు పలాస అభివృద్ధి కుంటుపడడానికి గతంలో దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న గౌతు ఫ్యామిలీనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అక్రమాలు జరిగినప్పుడు అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న గౌతు ఫ్యామిలీ ఏం చేసిందని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. పలాసలో తాతలు, తండ్రులు పేరు చెప్పుకుంటూ చాలామంది కాలం గడిపేస్తున్నారని మంత్రి అప్పలరాజు ఆరోపించారు.

అంతేకాదు శిరీష, ఆమె భర్త తన కాలిగోటితో సమానమని ఆమెలో పొగరు, బలుపు తప్ప ఏమీ లేవని మంత్రి అప్పలరాజు వ్యాఖ్యానించారు.. పలాస నాశనం కావడానికి కారణం వారి కుటుంబమేనని మంత్రి అప్పలరాజు గౌతు కుటుంబాన్ని పదేపదే టార్గెట్ చేస్తున్నారు. ఇక అంతేకాదు మొన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో పలాస మండలం టిడిపి అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావు పై దుండగులు దాడి చేసి పరారయ్యారు. అయితే తమపై దాడి చేయించింది మంత్రి సీదిరి అప్పలరాజు అని బాధితుడు లక్ష్మణరావు ఆరోపించారు. దీంతో వైసిపి నేతలు కూడా టిడిపి నేతల ఆరోపణలకు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు.
ఒకపక్క మంత్రి గౌతు ఫ్యామిలీపై చేస్తున్న వ్యాఖ్యలు, మరొక పక్క టిడిపి నేతలపై చేస్తున్న దాడులతో టిడిపినేత, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష నిప్పులు చెరిగారు. వ్యక్తిగత విషయాల జోలికి వస్తే ఇంటికొచ్చి కాళ్ళు విరగగొడతానని మంత్రికి వార్నింగ్ ఇచ్చారు. పలాసలో టిడిపి నేతలపై దాడులు చేసిన వారిపై కఠిన సెక్షన్లు నమోదు చేయకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె, పోలీసుల పైన కూడా విరుచుకుపడ్డారు.
దాడులు చేయటం తమకు తెలుసని, ఇంకొకసారి పర్సనల్ విషయాలు జోలికి వస్తే, ఇంటికొచ్చి కాళ్లు విరగొడతానని గౌతు శిరీష హెచ్చరించారు. పశువుల మంత్రి.. నీ అంతు చూస్తానంటూ రెచ్చిపోయారు. టిడిపి నాయకులపై దాడుల వెనక మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నాడని గౌతు శిరీష ఆరోపించారు.












Click it and Unblock the Notifications