వైద్య రంగంలో ఏపీ భేష్.. రికార్డ్ సాధించిన ప్ర‌భుత్వాసుప‌త్రులు

ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో వైద్య సేవ‌ల నాణ్య‌త పెంచేందుకు కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌నంగా ప్రాథ‌మిక‌, సెకండ‌రీ వైద్య సేవ‌లందించే 1,454 ఆసుప‌త్రుల‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ నేష‌న‌ల్ క్వాలిటీ అసెస్‌మెంట్ స్టాండ‌ర్డ్స్ (ఎన్‌క్వాస్‌ ) (NQAS Certification) స‌ర్టిఫికెట్లు ల‌భించిన‌ట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ బుధ‌వారం వెల్ల‌డించారు. సాధార‌ణంగా నాణ్య‌తా ప్ర‌మాణాల మేర‌కు కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కు ల‌భించే ఈ గుర్తింపు ఈ స్థాయిలో రాష్ట్రంలోని ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కు ల‌భించ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని మంత్రి అన్నారు. గ‌త ఏడాది జూన్‌లో అధికారంలోకొచ్చిన కూట‌మి ప్ర‌భుత్వం అప్ప‌టి నుండి వైద్య సేవ‌ల నాణ్య‌త‌ను పెంచ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి లభించిన గుర్తింపు అని మంత్రి అన్నారు.

ప్ర‌మాణాలు

ఓపీ, ఐపీ సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, మందుల అందుబాటు, పరిసరాల శుభ్రత, రికార్డుల్లో రోగులకు అందించిన చికిత్సా వివరాల నమోదు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఇన్ఫెక్షన్ కంట్రోల్, చికిత్స పొందిన రోగుల అభిప్రాయాల ఆధారంగా ఎన్‌క్వాస్ సంస్థ ఈ నాణ్య‌తా ప్ర‌మాణాల స‌ర్టిఫికెట్ల‌ను జారీ చేస్తుంది.

Government Healthcare Improves in Andhra Pradesh as 1 454 Hospitals Receive NQAS Certification

ఎన్ క్వాస్‌ పొందిన ఆసుప‌త్రులు

మొత్తం 1,454 ప్ర‌భుత్వాసుప‌త్రులు ఎన్‌క్వాస్ స‌ర్టిఫికేష‌న్ పొంద‌గా వీటిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు 1236, ప్రాథ‌మిక ఆరోగ్య‌కేంద్రాలు(PHC) 72, ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రాలు (UPHC) 139, సామాజిక ఆరోగ్య కేంద్రాలు (CHC) 7 ఉన్న‌ట్లు మంత్రి వివ‌రించారు.

ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించిన‌ నిపుణుల బృందం నేరుగా క్షేత్ర‌స్థాయిలో వాటిని పరిశీస్తుంది. వారిచ్చే నివేదికన‌నుసరించి ఎన్‌క్వాస్‌ సర్టిఫికెట్ ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి మ‌రో 272 ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కు స‌ర్టిఫికేష‌న్ కోసం కేంద్రానికి అధికారులు ప్ర‌తిపాద‌న‌లు పంపించారు. వీటిని ప‌రిశీలించేందుకు కేంద్ర‌ నిపుణుల బృందం ఈ నెల‌లో రాష్ట్రానికి రానుంది. కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యత ప్రమాణాలు పరీక్షించేందుకు 'ఎన్క్వాస్' విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఎన్‌క్వాస్‌ గుర్తింపులో తూర్పుగోదావ‌రి ఫ‌స్ట్‌

138 ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కు ఎన్‌క్వాస్ స‌ర్టిఫికెట్లు పొంది రాష్ట్రంలో తూర్పుగోదావ‌రి జిల్లా (138 స‌ర్టిఫికెట్లు) ప్రథ‌మ స్థానంలో నిల‌చింది. 122కి స‌ర్టిఫికెట్లు పొంది వైయ‌స్సార్ క‌డ‌ప జిల్లా ద్వితీయ స్థానంలో, 118కి స‌ర్టిఫికెట్లు పొంది ఏలూరు జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. గ‌త వైసిపి ప్ర‌భుత్వ ఐదేళ్ల పాల‌న‌లో 665 ఆసుప‌త్రుల‌కు మాత్ర‌మే ఈ గుర్తింపు ద‌క్కింది.

ఎన్‌క్వాస్‌కు కేంద్రం నగదు ప్రోత్సాహ‌కాలు

ఎన్ క్వాస్ గుర్తింపు పొందిన ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం న‌గ‌దు ప్రోత్సాహ‌కాలు (Incentives) ఇస్తుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల‌కు ఏడాదికి రూ.1.26 ల‌క్ష‌లు చొప్పున మూడేళ్ల‌పాటు ఇస్తుంది. అలాగే ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలకు(PHC) రూ. 3 ల‌క్ష‌లు చొప్పున, ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు(UPHC) రూ. 2 ల‌క్ష‌లు చొప్పున, సెకండ‌రీ హెల్త్ ప‌రిధిలోని ఆసుప‌త్రుల‌కు బెడ్‌కు రూ.10,000 చొప్పున మూడేళ్ల‌పాటు ప్రోత్సాహ‌కాలు అంద‌జేస్తుంది.

మంత్రి ప్ర‌శంస‌లు

కూట‌మి ప్ర‌భుత్వ ఆలోచ‌ల‌న మేర‌కు ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో వైద్య సేవ‌ల నాణ్య‌త‌ను పెంచ‌డానికి కృషి చేస్తున్న అధికారులు, వైద్యులు, ఇత‌ర సిబ్బందిని ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌శంసించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం చిత్త‌శుద్దితో కృషిని కొన‌సాగించాల‌ని మంత్రి సూచించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+