చంద్రబాబు ఎఫెక్ట్: ఏపీ విధానంతో దిగొచ్చిన ఎల్ఈడీ బల్బుల ధరలు
న్యూఢిల్లీ/అమరావతి: విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్ఈడీ బల్బులు వాడుతోంది. దీని కారణంగా ఎల్ఈడీ బల్బుల ధరలే తగ్గాయట. దీనిపై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ప్రశంసలు వెల్లువెత్తాయి.
నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో మెరుగైన పనితీరు కనబరిచిన ఏపీకి గతంలో కేంద్రం నుంచి ప్రశంసలు వచ్చాయి. తాజాగా ఎల్ఈడీ ధరలు దేశవ్యాప్తంగా తగ్గాయి. పది నెలల క్రితం 7 వాట్ల ఎల్ఈడీ బల్బు రూ.300గా ఉంటే, ప్రస్తుతం 9వాట్ల ఎల్ఆడీ బల్పు దాదాపు రూ.73కే లభిస్తోందని అంటున్నారు.
చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా విద్యుత్ పొదుపు, సంరక్షణను చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రెండు కోట్ల మందికి రూ.10కే ఎల్ఈడీ బల్పులను పంపిణీ చేస్తున్నారు. దీంతో, ధర నేలకు దిగి వచ్చిందని అంటున్నారు.

ఈ ప్రభావం దేశవ్యాప్తంగా పడింది. తొలుత 7వాట్ల ఎల్ఈడీ బల్బు ధర రూ.320గా, ఆ తర్వాత రూ.204కు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి. ఆ తర్వాత పది నెలలు తిరిగేసరికి 9వాట్ల ఎల్ఈడీ బల్బును రూ.72.40కే సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయి.
ఏపీ తీరు పట్ల కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఇంధన పొదుపు చర్యలు విస్తృతంగా అమలు చేసేందుకు వీలుగా స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాలని చంద్రబాబు ఆదేశించారని ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు.












Click it and Unblock the Notifications