రవాణా రంగానికి ప్రభుత్వం చేయూత నివ్వాలంటోన్న ఎంపి కేశినేని నాని
విజయవాడ: భారత దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న రంగం రవాణా రంగమని, అంతటి ప్రాధాన్యత కలిగిన రవాణా రంగానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. వ్యవస్థలో రవాణా రంగం అతి కీలకమని గుర్తించి ప్రభుత్వాలు తోడ్పాటు నిచ్చినట్లయితే ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారని అన్నారు.
కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ఏర్పడి యాభై ఏళ్లు అయిన సందర్భంగా ఘనంగా నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని మాట్లాడుతూ రవాణా రంగంలోకి రోజురోజుకీ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించడంతో పాటు తో పాటు అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. అందువల్ల ఆ మార్పులకు అనుగుణంగా సిబ్బందిని సిద్దం చేయడం కష్టమవుతోందన్నారు.

మోటారు వాహనాల తయారీ సంస్థలు కేవలం తయారీ తో సరిపెట్టుకోకుండా నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సిబ్బంది పనితనాన్ని మెరుగుపర్చాలని కోరారు. ఈ సందర్భంగా అశోక్ లేల్యాండ్, టాటా మోటార్స్ నుంచి వచ్చిన కొత్త వాహనాలను ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications