రాజధాని రైతులకు శుభవార్త, కానీ!: మంత్రి నారాయణ నిలదీత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది! భూములిచ్చిన రైతులకు మే 1 నుండి పరిహారం చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, పదేళ్ల పాటే రాజధాని కోసం భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. 9.14 ఏ నమూనా ప్రకారం ఈ ఒప్పందం చేసుకుంటుంది. అలాగే, రైతులకు ప్రతి ఏటా మే నెల ఒకటోతేదీలోగా చెల్లింపులు పూర్తి చేస్తారు. ఏటా మే 1లోగా వార్షిక మొత్తాన్ని ఈ ఉత్తర్వులో పేర్కొంది. సీఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులందరికీ మే 1లోగా చెల్లింపులు ఉంటాయని తెలిపారు.

ఇదిలా ఉండగా, రాజధాని ప్రాంత రైతులు మంగళవారం నాడు సమావేశమై అమరావతి రాజధాని భూసమీకఱణ రైతు సమాఖ్యను ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం విషయంలో భూములిచ్చిన రైతుల సమస్యలపై సమావేశంలో చర్చించారు.
మంత్రి నారాయణ నిలదీత
మంత్రి నారాయణ మంగళవారం నాడు తుళ్లూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రుణమాఫీపై నిలదీశారు. రాజధాని కోసం భూములు ఇచ్చినా తమకు రుణమాఫీ అమలు కాలేదని చెప్పారు. బ్యాంకులు, అధఇకారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అభివృద్ధి చేసిన భూములు ఎక్కడిస్తారో చెప్పాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications