రిమ్ జిమ్ రిమ్ జిమ్: సైకిల్ తొక్కిన గవర్నర్ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆదివారంనాడు సైకిల్ తొక్కి అందరినీ సంతోష పెట్టారు. జిహెచ్‌ఎంసి, ఎపిఐఐసి, హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్ ఆదివారంనాడు సంయుక్తంగా గచ్చిబౌలిలో బైక్ స్టేషన్‌ను నిర్మించాయి. అది సైకిల్ షెల్టర్. దాన్ని గవర్నర్ నరసింహన్ ఆదివారంనాడు ప్రారంభించారు.
ఆ తర్వాత బైసెక్లోన్ 2013 పేరిట చేట్టి 10, 25, 60 కిలోమీటర్ల సైకిల్ యాత్రను గవర్నర్ ప్రారంభించారు. జెండా ఊపి ఆయన దాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడారు. రానున్న పదేళ్లలో హైదరాబాద్ నగరాన్ని మోటారు రహితంగా మార్చాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, ప్రసాద్ కుమార్, నగర మేయర్ మాజిద్ హుస్సేన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ కృష్ణబాబు, శాసనసభ్యుడు బిక్షపతి యాదవ్, ఎపిఐఐసి ఎండి జయేష్ రంజన్ మెట్రోరైలు ఎండి ఎస్‌పిఎస్ రెడ్డి, సైబారాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

సైకిల్ తొక్కాల్సిందేనట..
గవర్నర్ నరసింహన్ ఆదివారంనాడు హైదరాబాదులోని గచ్చిబౌలిలో బైక్ స్టేషన్‌ను ప్రారంభించి, ఇలా సైకిల్ తొక్కారు.

ఉత్సాహంగా, ఉల్లాసంగా..
ఆదివారం ఉదయం దాదాపు వేయి మంది యువకులు, సీనియర్ పౌరులు బైసైక్లోన్ 2013లో పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్ హెల్మెట్ ధరించి సైకిల్‌పై స్వారీ చేశారు.

కాలుష్యరహితంగా చేయడమే..
నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడంతో పాటు నగర జీవుల్లో ఫిట్నెస్‌ను పెంచడానికి ఇటువంటి బైక్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. హెచ్‌బిసి సైకిల్ టు వర్క్ చేపట్టి మంచి కమ్యూటింగ్ కల్చర్‌ను పెంపొందించాలని ప్రయత్నిస్తోంది.

బైక్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది..
ఈ బైక్ స్టేషన్లో 300 సైకిళ్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. స్వైప్ కార్డు టెక్నాలజీతో అది పనిచేస్తుంది. సభ్యులుగా చేరినవారికి స్వైప్ కార్డులు ఇస్తారు.












Click it and Unblock the Notifications