తెలుగు రాష్ట్రాలకు గవర్నర్: నరసింహన్ స్థానంలో సదాశివం?

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా జస్టిస్ సదాశివం రావొచ్చునని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత గవర్నర్ నరసింహన్‌ స్థానంలో కేరళ గవర్నర్‌, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీ సదాశివంను నియమించనుందా!? అంటే కావొచ్చునని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించేందుకు, న్యాయబద్ధంగా వ్యవహరించేందుకు జస్టిస్‌ సదాశివం వంటి అత్యున్నత స్థానంలో పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి సేవలు అవసరమన్న చర్చ కేంద్రంలో జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Governor Narasimhan to be replaced?

గత ఏడాది సెప్టెంబర్‌ 5న షీలా దీక్షిత్‌ స్థానంలో జస్టిస్‌ సదాశివం కేరళ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, నరసింహన్‌ మాదిరిగానే జస్టిస్‌ సదాశివం కూడా తమిళనాడుకు చెందినవారే కావడం గమనార్హం.

ఏపీకి చెందిన సీనియర్‌ నేత ప్రొఫెసర్‌ ఎస్‌వీ శేషగిరిరావును గవర్నర్‌గా నియమించాలని కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్య నాయుడు కూడా సిఫారసు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే, గవర్నర్‌గా న్యాయకోవిదుడిని నియమించాలని కేంద్రం భావిస్తుండవచ్చునని అంటున్నారు.

కాగా, ఇక తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి గవర్నర్ నరసింహాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంటికి పంపవచ్చుననే వార్తలు ఇటీవల వస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఇద్దరు గవర్నర్లు రాబోతున్నారని సమాచారం. గవర్నర్ల మార్పుల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారని వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+