టిఎస్‌పిఎస్సికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్: రెండ్రోజుల్లో జీవో!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్సి) ఏర్పాటుకు గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ ఆమోదం తెలిపారు. టిఎస్‌పిఎస్సి ఏర్పాటు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫైలుపై గురువారం ఆయన ఆమోద ముద్రవేశారు.

దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు, కొత్త నియామకాలు జరుపుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలిగినట్లయింది. ఏపిపిఎస్సికి చెందిన ఉన్నతాధికారులతో గవర్నర్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు తుది నిర్ణయం తీసుకున్నారు.

Governor Narsimhan gives green signal for TSPSC

సాంకేతికపరమైన అంశాలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత గురువారం సాయంత్రం గవర్నర్ టిఎస్‌పిఎస్సి ఫైలుపై సంతకం చేశారు. శుక్రవారం లేదా శనివారం ఈ విషయంలో జీవో జారీ అయ్యే అవకాశం ఉంది.

టిఎస్‌పిఎస్సి ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలుపడాన్ని ఉద్యోగ సంఘాల జెఏసి ఛైర్మన్ దేవీ ప్రసాద్ స్వాగతించారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చూపిన చొరవ అభినందనీయమని, ఆయన కృషి ఫలితంగానే ఇంత తొందరగా టిఎస్‌పిఎస్సి ఏర్పడుతున్నదని ఆయన అన్నారు. దేవీ ప్రసాద్ తోపాటు ఇతర ఉద్యోగ సంఘాల నేతలు, నిరుద్యోగులు టిఎస్‌పిఎస్సి ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+