హైదరాబాద్ అల్లర్లపై మెజీస్టిరియల్ దర్యాప్తు: గవర్నర్

అల్లర్లలో మృతి చెందిన కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 నష్ట పరిహారాన్ని గవర్నర్ ప్రకటించారు. అలాగే ఆస్తులు కోల్పోయినవారికి నిబంధ నల ప్రకారం పరిహారం చెల్లింపులు ఉంటాయని గవర్నర్ నరసింహన్ ప్రకటించారు.
కిషన్‌బాగ్‌లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో డిజిపి ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి గురువారం ఉదయం పర్యటించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డిజిపి పోలీసులను ఆదేశించారు.
బుధవారం ఉదయం కిషన్‌బాగ్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications