మంత్రి కిడారి శ్రావణ్‌తో రాజీనామా చేయించండి: సీఎంకు గవర్నర్ అదేశం : కారణం అదేనా..!
Recommended Video
ఏపీ కేబినెట్‌లో ఒక మంత్రిని రాజీనామా చేయించాలని నేరుగా గవర్నర్ నరసింహన్..ముఖ్యమంత్రిని ఆదేశించారు. వైద్య..గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న కిడారి శ్రావణ్‌తో రాజీనామా చేయించాలని గవర్నర్ ఆదేశంగా రాజ్‌భవన్ నుండి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తున్న వేళ.. ఏపీ కేబినెట్ భేటీ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో గవర్నర్ ఆదేశం ఇప్పుడు ప్రభుత్వంలో హాట్ టాపిక్‌గా మారింది.
మంత్రి శ్రావణ్‌తో రాజీనామా చేయించండి...
2014 ఎన్నికల్లో అరకు నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కిడారి సర్వేశ్వరరావు ఆ తరువాత టీడీపీలో చేరారు. ఆయనకు విప్ పదవి లభించింది. గత ఏడాది ఆయనను మావోయిస్టులు కాల్చి చంపారు. ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వదేశానికి తిరిగి రాగానే సర్వేశ్వర రావు కుమారుడి బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గత నవంబర్ 11న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించారు.
కీలకమైన వైద్య..గిరిజన సంక్షేమ శాఖలు అప్పగించారు. అయితే, ఆయనకు ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని భావించినా.. అలా చేయలేదు. గత నెల 11న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అరకు నుండి టీడీపీ అభ్యర్దిగా బరిలో ఉన్నారు. ఇంకా ఫలితాలు రాలేదు. ఇదే సమయంలో ఆయనను మంత్రి పదవికి రాజీనామా చేయమని కోరాలని గవర్నర్ నరసింహన్ ఏకంగా ముఖ్యమంత్రికి సూచించారు.

సమయం పూర్తయింది...
ఎవరైనా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా సభ్యత్వం పొందాలి . అయితే, గత ఏడాది నవంబర్ 11న శ్రావణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 10వ తేదీతో ఆయనకు ఆరు నెలల సమయం పూర్తువుతుంది. ఈ సమయంలోనే ఆయన చట్ట సభల్లో సభ్యుడిగా అర్హత సాధించ్ పోతే ఆటోమేటిక్‌గా మంత్రి పదవి కోల్పోతారు. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెల్లడి కానున్నాయి. ఫలితాల్లో శ్రావణ్ విజయం సాధించినా..వచ్చే సభలో సభ్యుడిగా ఉంటారు. ఈ నెల 10వ తేదీకి మంత్రి పదవి కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో..ముందుగానే శ్రావణ్ ద్వారా మంత్రి పదవికి రాజీనామా చేయించాలని గవర్నర్ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించారు. రాజ్యంగం ప్రకారం నిబంధనలు పాటించాల్సి ఉండటంతో మంత్రి పదవికి శ్రావణ్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications