గ్యారెంటీల అమలు పై గవర్నర్ తమిళసై కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళసై సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. కాలోజీ కవితతో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారన్నారు. దీంతో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం వచ్చిందన్నారు.
ప్రభుత్వ లక్ష్యాలు : అసెంబ్లీ తొలి రోజు సమావేశానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరయ్యారు. గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామన్నారు. అర్హులైన వారికి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందన్నారు. త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. యువతకు 2 లక్షల ఉద్యోగుల కల్పనపై దృష్టిపెట్టామన్నారు.

హామీలు అమలు చేస్తాం : ప్రజావాణిలో 1.8కోట్ల దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతులు, యువత, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మౌలిక వసతులరంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తామన్నారు. గత సమావేశాల్లో ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. దేశ ఏఐ క్యాపిటల్ గా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 10 నుంచి 12 ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రానికి కొత్తగా రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ వివరించారు.

ప్రజాపాలన కొనసాగుతుంది : ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తామని గవర్నర్ చెప్పుకొచ్చారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తు చేసారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం, మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈ విధానాన్ని కూడా అమలులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం లక్ష్యాలను వివరించిన గవర్నర్.. ప్రధానంగా ప్రజలు కోరుకున్న విధంగా పాలన ఉంటుందని స్పష్టం చేసారు. రేపు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పై చర్చ జరగనుంది. 10న ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications