స్కూళ్లకు వరుసగా మరో రోజు సెలవు..!!

స్కూల్లకు మరో రోజు సెలవు ప్రకటించారు. రేపు (గురువారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయే ట్ .. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ సెలవు ప్రకటించారు. పోలింగ్ జరిగే జిల్లాల్లో ప్రభుత్వ స్కూళ్ల సెలవు పైన స్పష్టత ఇచ్చా రు. తాజాగా ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని అన్ని స్కూళ్లకు విద్యా శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో, ఎన్నికలు జరిగే జిల్లాల్లో రేపు అన్ని రకాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

ఏపీలో ఏడు జిల్లాల్లో రేపు (గురువారం) ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అదే విధంగా ఉభయ గోదావరితో పాటుగా
ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు జరగనున్నాయి. ఇక, ఇప్పటికే ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల సిబ్బంది ఈసీ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ సామాగ్రి, భద్రత చర్యల పైన ఎన్నికల అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలు పోటీలో ఉన్న వారికి ప్రతి ష్ఠాత్మకంగా మారటం పోలింగ్ ఆసక్తి కరంగా మారుతోంది.

Govt announces holiday for All Schools on Feb 27th due to mlc election day

పోలింగ్ లో పాల్గొనే ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని సంస్థల యాజ మాన్యాలకు ఎన్నికల అధికారులు సూచన చేసారు. ఓటు వేసుకునేందుకు సమయం ఇవ్వాలని స్పష్టం చేసారు. ఇక, పలు ప్రాంతాల్లో పాఠశాలల్లోనూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. దీంతో, ఈ రోజు శివరాత్రి.. రేపు ఎమ్మెల్సీ పోలింగ్ ఉండటంతో ముందస్తుగానే పాఠశాలలకు సెలవు ఖరా రు చేసారు. కాగా, ప్రయివేటు విద్యా సంస్థల విషయంలో కొంత సస్పెన్స్ కొనసాగింది. తాజాగా ఎన్నికల అధికారుల సూచన మేరకు జిల్లా కలెక్టర్లు సెలవు పైన విద్యా శాఖ అధికారులకు స్పష్టత ఇచ్చారు. దీంతో.. విద్యా శాఖ ఆధికారుల ఆదేశాలతో ప్రయివేటు విద్యా సంస్థలకు పేరెంట్స్ కు సెలవు గురించి మెసేజ్ లు పంపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+