కెసిఆర్ కుటుంబ సభ్యులతో : అన్నీ తానై : తిరుపతిలో చెవిరెడ్డి స్వాగతం..
టిఆర్‌యస్ తో వైసిపి సంబంధాల పై ఏపిలో రాజకీయంగా చర్చ సాగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో వైసిపి పరోక్షంగా వైసిపికి సహకరించిందని టిడిపి ఆరోపిస్తోంది. తెలంగాణలో టిఆర్‌యస్ గెలిస్తే ఏపిలో వైసిపి సంబరాలేంటని టిడిపి నిలదీస్తోంది. ఇదే సమయంలో టిఆర్‌యస్ తో పొత్తు కోసం ప్రయత్నించింది టిడిపీనే అంటూ జగన్ ప్రత్యారోరపణ చేస్తున్నారు. ఇదే సమయంలో..కెసిఆర్ సమీమణి శోభా తో పాటుగా కుటుంబ సభ్యులు..హరీష్ తిరుమల చేరుకున్నా రు. వారికి అక్కడ అదే జిల్లాకు చెందిన వైసిపి నేత చేసిన హడావుడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తిరుమల లో శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ సీయం తెలంగాణా సీఎం కేసీఆర్ సతీమణి శోభారావు, మాజీ మంత్రి హరీష్‌రావుకు తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. వీరు తిరుపతిలో దిగిన సమయం నుండి ప్రతీ సందర్భంలోనూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. రేణిగుంటలో స్వాగతం పలకటం దగ్గర నుండి శోభ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి లోని గోవిందరాజస్వామిని దర్శించుకున్నారు.

ఆ సమయంలోనూ వైసిపి ఎమ్మెల్యే వెంటనే ఉన్నారు. వారికి శాలువా, పుష్పగుచ్చం, జ్ఞాపిక అందచేసి సత్కరించారు. కెసిఆర్ ఏపి లో చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని చెబుతున్న సమయంలో..ఏపి లో కెసిఆర్ కుటుంబ సభ్యులకు వైసిపి ఎమ్మెల్యే ఇంతగా ప్రాధాన్యత ఇవ్వటం పై సర్వత్రా చర్చ మొదలైంది. ఒకవైపు వారికి టిటిడి నుండి ఆతిధ్యం లభిస్తోంది. ప్రొటోకాల్ ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇదే సమయంలో..వైసిపి ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఇంతగా శ్రద్ద చూపటానికి కారణాల పై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇక, గతంలోనూ చెవిరెడ్డి భాస్కర రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని తిరుపతి వచ్చిన సమయంలోనూ కలిసారు. కెసిఆర్ ను హైదరాబాద్ లోనూ ఆయన నివాసానికి వెళ్లి కలిసారు. తెలంగాణ లో వ్యాపార పనుల నిమిత్తం కలిసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ గెలిచిన తరువాత ఆయనకు మద్దతుగా గుడివాడ లో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంటో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఇప్పుడు చెవిరెడ్డి..కెసిఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తుంటే..ఇవి పార్టీ అధినేత అనుమతితో జరుగుతున్నవా..లేక వీరి వ్యక్తిగత ఇష్టాఇష్టాల మేరకు నడుచుకుంటున్నారా అనే సందేహం వ్యక్తం అవుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications