మనవడి బారసాల: రేపు బిజీ కానున్న బాబు, పరిమిత సంఖ్యలో అతిథులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో శుక్రవారం నాడు బారసాల కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో అటు చంద్రబాబు కుటుంబంతో పాటు ఇటు బాలయ్య కుటుంబం సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఈ బారసాల కార్యక్రమం చంద్రబాబు నివాసంలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నారా లోకేశ్ దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో బాలయ్య, చంద్రబాబు బంధువులు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.
శ్రీ మన్మథనామ సంవత్సరం ఉగాది పర్వదినాన నారా లోకేష్, బ్రహ్మణి దంపతులకు శనివారం సాయంత్రం గం. 4.18 నిమిషాలకు మగబిడ్డ జన్మించాడు. దీంతో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ తాతలు అయ్యారు. మాదాపూర్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో బ్రహ్మణికి బాబుకు జన్మనిచ్చారు.

మనవడు జన్మించిన సమయంలో సీఎం చంద్రబాబు చిత్తూరు పర్యటనలో ఉన్నారు. ఆ రోజు సాయంత్రం చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకుని రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుని తన మనవడని చూసి చూసి మురిసిపోయారు.
విమానాశ్రయం నుంచి నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా హత్తుకుని సంబరపడ్డారు. సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్.. బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణికి 2007లో వివాహం జరిగింది.












Click it and Unblock the Notifications