మోడీపై బాబు అసంతృప్తి! భార్యలే వద్దంటున్నారని..

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయిస్తున్న నిధుల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికంగా సమన్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు పది శాతం వాటా పెంచడం అభినందనీయమని, అయితే, మిగులు ఉన్న వారికి ఏపీకి తేడా చూపలేదని వ్యాఖ్యానించారు.

పక్క రాష్ట్రాలతో పోల్చితే అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక సాయంపై ప్రధాని నరేంద్ర మోడీని కోరుతామన్నారు. 14వ ఆర్థిక సంఘం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయన్నారు. అయినా అధైర్యపడబోనని, రాష్ట్రాన్ని ప్రగతిబాటలో నడపడానికి రేయింబవళ్లు శ్రమిస్తానన్నారు.

తానెప్పుడు ఓడిపోలేదని, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎదురునిలబడి పోరాడతానని, అనుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి తీరుతానని చంద్రబాబు అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన బుధవారం ఉదయం మీడియాతో, సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించారు.

చంద్రబాబు

చంద్రబాబు

14వ ఆర్థిక సంఘం సిఫారసులు, తద్వారా రాష్ట్రానికి జరిగే నష్టాలను వివరించారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం వుండడంతో పాటు ఏపీ అభివృద్ధి కోసమే ఎన్డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కేంద్రంపై శాంతియుతంగా ఒత్తిడి తెచ్చి ప్రత్యేక ప్యాకేజీ సాధించుకొస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనను సమర్థించిన అన్నిపక్షాలు తమతో కలిసిరావాలని కోరారు.

చంద్రబాబు

చంద్రబాబు

దేశంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీని చూడటం పట్ల బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో రెవెన్యూ లోటు భర్తీలో భాగంగా 22 వేల కోట్లు కేటాయించడంతో రాష్ట్రానికి ఎంతోమేలు జరిగిపోయిందని అందరూ అనుకోవడం, పత్రికలు సైతం ఈ విషయం పట్ల అధ్యయనం చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ఏపీతో పాటు మరో పది రాష్ట్రాలకు నిధులు కేటాయించడాన్ని ప్రస్తావించారు. దీనివల్ల ఏపీకి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

పొరుగు రాష్ట్రాల రాజధానులు మహానగరాలుగా విస్తరించాయని, వీటితో సమానంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడ అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

14వ ఆర్థిక సంఘ సమావేశంలో దీనిపై సమగ్ర నివేదిక ఇచ్చామని చెప్పారు. అయినా ఆర్థిక సంఘ సిఫారసుల్లో ఈ నిధుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లో ఉన్న పాలసీలే విజయవాడలోనూ అమలు చేస్తే పారిశ్రామికవేత్తలు విజయవాడలో ఎందుకు పెట్టుబడులు పెడతారని ప్రశ్నించారు.

చంద్రబాబు

చంద్రబాబు

అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఎప్పటికి అభివృద్ధి చెందాలి అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఐఏఎస్‌ ఉద్యోగుల గురించి ప్రస్తావిస్తూ.. మన అధికారులే హైదరాబాద్‌ వదిలి రాలేమంటున్నారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

వాళ్లు వద్దామన్నా వాళ్ల భార్యలు వద్దంటున్నారని, మరి పరిశ్రమలు ఎలా వస్తాయో ఆలోచించాలని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ అవార్డు ఇవ్వాలని రాష్ట్రపతి లేఖ రాసినా అది కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విభజన సందర్భంగా పార్లమెంట్‌లో చేసిన తీర్మానాలను కూడా అమలు చేయలేకపోవడం అన్యాయమని చంద్రబాబు ఆక్రోశించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రరాష్ట్ర ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన విభజన, చేయని నేరానికి రాష్ట్రప్రజలను శిక్షించడం న్యాయం కాదని ఆయన కేంద్రానికి విన్నవించారు.

చంద్రబాబు

చంద్రబాబు

పక్కనున్న మూడు రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి జరిగే వరకు కేంద్రం చేయూతనివ్వాలని ప్రధాని మోడీనిఇప్పటి వరకు ఏడుసార్లు కోరానని చంద్రబాబు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+