ఐదు రోజుల్లో పెళ్లి .. అంతలోనే అనంత లోకాలకు వరుడు .. అనంతపురం జిల్లాలో విషాదం

జీవితం మీద ఎన్నో ఆశలతో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకున్న వరుడు ఆ ఆశలు తీరకుండానే, పెళ్లి కాకుండానే కడతేరి పోయాడు. మరో ఐదు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఊహించని విధంగా కాటికి పయనమయ్యాడు. ఎంతో సంతోషంగా ఈ నెల 27వ తేదీన పెళ్లి చేసుకోవాలని దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు వచ్చిన పెళ్లి కొడుకు పెళ్లికి ఐదు రోజుల ముందు కానరాని లోకాలకు చేరిపోయాడు.

ఐదు రోజుల్లో పెళ్లి .. రోడ్డు ప్రమాదం, మృత్యు ఒడికి చేరుకున్న వరుడు

ఐదు రోజుల్లో పెళ్లి .. రోడ్డు ప్రమాదం, మృత్యు ఒడికి చేరుకున్న వరుడు

అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకుల వాండ్ల పల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు మృత్యు ఒడికి చేరుకున్నాడు. ఈ నెల 27వ తేదీన అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డికి చెందిన 26 సంవత్సరాల మహేష్ వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి సమయం దగ్గర పడుతున్న క్రమంలో శుభలేఖలు ఇవ్వాలని బంధువులకు వివాహ పత్రికలను పంచడం కోసం తిరుగుతున్న మహేష్ ను మృత్యువు కబళించింది. పెళ్లి కార్డులు ఇవ్వాలని స్వగ్రామం నుంచి అర్ధరాత్రి సమయంలో బయలుదేరిన మహేష్ కొద్ది సమయానికే గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు.

 పెళ్ళికొడుకు మృతితో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం

పెళ్ళికొడుకు మృతితో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం

ఉపాధి కోసం దక్షిణాఫ్రికాలో పనిచేస్తున్న మహేష్ తన పెళ్లి నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే అనంతపురానికి వచ్చాడు. అంతలోనే కడతేరి పోయాడు. మహేష్ మృతి తెలిసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా హతాశులయ్యారు. మహేష్ మృతి విషయం తెలిసి పెళ్లికుమార్తె సైతం ఒక్క సారిగా షాక్ కు గురయింది. అటు ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. త్వరలో ఓ ఇంటివాడుగా కోడలితో జంటగా వస్తాడు అనుకుంటే అందరిని వదిలేసి వెళ్లాడని మహేష్ కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు ఎర్రదొడ్డి గ్రామంలో మిన్నంటాయి.

 పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు

పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు

బంధువుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడం అందరినీ ఆవేదనకు గురి చేసింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ తరహా సంఘటన జరిగింది. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుందామనుకున్న యువకుడు ఊహించని విధంగా రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. కరీంనగర్ జిల్లా వీణవంక కు చెందిన సంతోష్ కు మే 15వ తేదీన వివాహ నిశ్చయం కాగా, పెళ్లి పనుల్లో తిరుగుతున్న సంతోష్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఇలాంటి ఘటనలు ఎన్నో ఆశలతో కొత్త జీవితంలో అడుగు పెట్టాలి అనుకుంటున్న కొత్త జంటలకు ఒకింత బాధ కలిగిస్తున్న పరిస్థితి ఉంది.

Recommended Video

    Viral: పెళ్లి కొడుకును పీటల మీదే చెప్పుతో.. Mother Beats Groom With Slipper
    పెళ్లి చేసుకుందామని కలలు కన్నా, విధిరాత కలలు కల్లలు చేసింది

    పెళ్లి చేసుకుందామని కలలు కన్నా, విధిరాత కలలు కల్లలు చేసింది

    పెళ్ళికి అంగీకరించి , వారితో జీవితాన్ని ఊహించుకున్న అమ్మాయిలకు ఇలాంటి ఘటనలు వారి ఆశలను మొగ్గలోనే తుంచేస్తున్న పరిస్థితి ఆవేదన కలిగిస్తుంది. తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అంటారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విధి రాతను నిందించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. తలరాతను ఎవరూ మార్చలేరు అని పెద్దలు చెప్పే మాట అక్షర సత్యమే అయినప్పటికీ, పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవుదామనుకుని ఎన్నో కలలు కన్న యువకులు పెళ్లికి ముందు ఇలా బలైపోవడం అత్యంత బాధాకరం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+