మరికొన్ని గంటల్లో పెళ్ళి,ప్రియురాలితో వరుడు జంప్,తమ్మడిని చేసుకోవాలంటూ లేఖ

పెళ్ళికి కొన్ని గంటల ముందుగానే ప్రేమించిన అమ్మాయితో వెళ్తున్నానని చెప్పి ఓ పెళ్ళికొడుకు పారిపోయాడు. తన సోదరుడిని వివాహం చేసుకోవాలని పెళ్ళికూతురికి సలహ ఇచ్చాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది.

అనంతపురం:మరికొన్ని గంటల్లో వివాహం ఉంది.అయితే ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకొంటానని లేఖ రాసి వరుడు పారిపోయాడు. అయితే తన తమ్ముడిని వివాహం చేసుకోవాలని పెళ్ళికూతురికి సలహ ఇచ్చాడు.ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది.

అనంతపురం పట్టణంలోని సిండికేట్ నగర్ లో చరణ్ అనే యువకుడు కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు.ఆయన రైల్వేలో టిక్కెట్టు కలెక్టర్ గా పనిచేస్తున్నాడు.

అయితే ఆయన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ కూడ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. కాని, వీరి పెళ్ళికి తల్లిదండ్రులు అంగీకరించలేదు.

groom missing day before marriage in anantapur

దీంతో మరో యువతితో వివాహన్ని చరణ్ కుటుంబసభ్యులు నిశ్చయించారు.ఫిబ్రవరి రెండో తేదిన వివాహం జరిపించాలని నిర్ణయించుకొన్నారు.

పెళ్ళికి ఏర్పాట్లు కూడ పూర్తయ్యాయి. అమ్మాయి కుటుంబసభ్యుల నుండి ఐదు లక్షల రూపాయాలను కట్నంగా తీసుకొన్నారు చరణ్ కుటుంబసభ్యులు.

అయితే కొన్ని గంటల్లోనే వివాహం జరగాల్సి ఉండగా తాను ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకొంటానంటూ లేఖ రాసి చరణ్ వెళ్ళిపోయాడు.

ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశాడు.అంతేకాదు తన సోదరుడిని వివాహం చేసుకోవాలని పెళ్ళికూతురుకు ఆ లేఖలో సలహ ఇచ్చాడు. పెళ్లికొడుకు పారిపోవడంతో పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళికుమార్తె తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+