Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్ర ఖజానాపై రూ. 2.10 లక్షల కోట్లు

GST April 2024 collections: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయలను దాటాయి. దేశంలో జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత వసూళ్లు రెండు లక్షల కోట్ల రూపాయలను దాటడం ఇదే తొలిసారి.

గత సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే 12.4 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన జీఎస్టీ వసూళ్లు-2,10,267 కోట్ల రూపాయలు. 2023లో ఇదే ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే ఈ సంఖ్య 12.4 శాతం అధికం.

GST collections high in April 2024 at Rs 2 10 lakh Crore Andhra Pradesh records 4 850 Cr

ఇందులో సీజీఎస్టీ వాటా 43,846 కోట్లు, ఎస్‌జీఎస్టీ- 53,538 కోట్లు, ఐజీఎస్టీ- 99,623 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన జీఎస్టీ వల్ల వచ్చిన ఆదాయం 37,826 కోట్ల రూపాయలను ఇందులోనే విలీనం చేశారు. ఇక సెస్ రూపంలో అందిన మొత్తం 13,260 కోట్ల రూపాయలు. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్ వల్ల 1,008 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా ఇందులోనే కలిపారు.

ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల ఏకంగా 12 శాతంగా నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఏపీలో నమోదైన జీఎస్టీ వసూళ్లు 4,329 కోట్ల రూపాయలు.. కాగా ఇప్పుడు ఈ సంఖ్య 4,850 కోట్ల రూపాయలుగా నమోదైంది. తెలంగాణతో పోల్చుకుంటే ఈ మొత్తం ఎక్కువే. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు 11 శాతం.

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.789 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.1,015 కోట్లు, పంజాబ్-రూ.2,796 కోట్లు, చండీగఢ్-రూ.313 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.2,239 కోట్లు, హర్యానా-రూ.12,168 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి. ఢిల్లీ-రూ.7,772 కోట్లు, రాజస్థాన్-5,558 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.

ఉత్తర ప్రదేశ్-రూ.12,290 కోట్లు, బిహార్-రూ.1,992 కోట్లు, సిక్కిం-రూ.403 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.200 కోట్లు, నాగాలాండ్-రూ.86 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. మణిపూర్-రూ.104 కోట్లు, మిజోరం-రూ.108 కోట్లు, త్రిపుర-రూ.161 కోట్లు, మేఘాలయ-రూ.234 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లను అందుకున్నాయి.

అస్సాం-రూ.1,513 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.7,293 కోట్లు, జార్ఖండ్-రూ.3,829 కోట్లు, ఒడిశా-5,902 కోట్లుగా రికార్డయ్యాయి. ఛత్తీస్‌గఢ్- 4,001, మధ్యప్రదేశ్-రూ.4,728 కోట్లు, గుజరాత్-13,301 కోట్లు, డయ్యూ డామన్/దాద్రానగర్ హవేలి-రూ.447 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లను సాధించాయి.

మహారాష్ట్ర-రూ.37,671 కోట్లు, కర్ణాటక-రూ.15,978 కోట్లు, గోవా-రూ.765 కోట్లు, కేరళ-రూ.3,272 కోట్లు, తెలంగాణ- రూ.6,236 కోట్లు, తమిళనాడు-రూ.12,210 కోట్లు, పుదుచ్చేరి-రూ.247 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.65 కోట్ల రూపాయల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+