వారాహి ఏపీ రూల్స్ ఫాలో కావాల్సిందే-వైజాగ్ పాలనకు ముహుర్తమిదే-మంత్రి అమర్నాథ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ వారాహి వాహనం తెలంగాణలో రిజిస్ట్రేషన్ కావడంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఏపీలో రూల్స్ తాము చెప్పామని, ఆయన హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకున్నారేమో అని వ్యంగాస్త్రాలు సంధించారు. అలాగే పవన్ వారాహి నంబర్ 8384 ఇవ్వడంపైనా సెటైర్లు వేశారు. ఈ నాలుగు నంబర్లు కలిపితే 23 అని, అది చంద్రబాబుకు నచ్చిన నంబర్ అని అమర్ నాథ్ తెలిపారు. వారాహి వాహనం ఏపీకి వచ్చాక దానిపై తాము స్పందిస్తామన్నారు. అమెరికాలో కొన్నా వాహనం ఇక్కడి నిబంధనల ప్రకారమే వాడాలన్నారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచే వైజాగ్ లో ఏపీ ప్రభుత్వ పాలన ప్రారంభం కాబోతోందని మంత్రి అమర్ నాథ్ తెలిపారు. తనను నిద్రలో నుంచి లేపి అడిగినా ఇదే చెప్తానన్నారు. గతంలోనూ ఇదే విషయం పలుమార్లు చెప్పానని అమర్నాథ్ గుర్తు చేశారు. సొంత తమ్ముడిని చైన్లతో కట్టించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ ను సైకో అని విమర్శిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న విమర్శలకు రేపు జనమే సమాధానం చెప్తారన్నారు.

 gudivada amarnath says pawans varahi to follow local rules, vizag rule from 2023 june

అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదు దండయాత్ర అని తాము ఎప్పుడో చెప్పామని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మళ్ళీ యాత్ర మొదలుపెట్టాలని ఆలోచన చేసినా కూడా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షల ముందు తలవంచాల్సిందేనన్నారు. రుషికొండపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ విషం కక్కుతున్నారని ఆయన ఆరోపించారు. రుషికొండ నిర్మాణాలలో ప్రభుత్వ కార్యాలయాలు తప్ప ఏమీ లేవని, సీపీఐ నారాయణ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సీపీఐ నారాయణ చెప్పిన మాటలు టీడీపీ తలకెక్కలేదన్నారు.

అమరావతి ప్రాంతంలో పర్యావరణ ఇబ్బందులు వచ్చినపుడు ఎవరికి కనపడలేదా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. దేశానికి రాష్ట్రానికి నష్టం కలిగినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైద్రాబాద్ లో కొండలు లేవా..అవి బద్దలు కొడుతున్నప్పుడు ఇబ్బంది లేదా అని ప్రశ్నించారు. వైజాగ్ వేదికగా ఎలాంటి నిర్మాణం జరగడానికి వీల్లేదు అనే ధోరణి తో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+