కాళ్ళు పట్టుకోలేం... విజయసాయి రాజీనామాపై గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్

వైసిపి కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేసుకుంటానని పేర్కొన్న విజయసాయిరెడ్డి తాజా నిర్ణయం పైన ఇప్పటికే వైసీపీ స్పందించిన విషయం తెలిసిందే.

విజయసాయి రాజీనామాపై వైసీపీ స్పందన ఇలా
విజయ సాయి రెడ్డి నిర్ణయాన్ని ఆమోదించకపోయినా, ఆయన ఎంపికను ఎప్పటికీ గౌరవిస్తామని పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి బలమైన మూల స్తంభాలలో ఒకరిగా విజయ సాయి రెడ్డి ఉన్నారని వైసిపి పేర్కొంది. విజయ సాయి రెడ్డి నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని, మీ సహాయ సహకారాలు ఎప్పుడు గుర్తుండిపోతాయని వైసిపి విజయ సాయి రెడ్డి రాజీనామా పైన ట్వీట్ చేసింది.

Gudivada Amarnath shocking comments on Vijayasai reddy resignation

కాళ్ళు పట్టుకోలేం అంటూ ఘాటు వ్యాఖ్యలు
తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామా పైన ఘాటుగా స్పందించారు. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలోని పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన అనంతరం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ మారే వాళ్ళని సముదాయిస్తాం కానీ కాళ్లు మాత్రం పట్టుకోలేమని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేశారు .

నాయకుడు పోతే నాయకులను తయారు చేసుకోవటం జగన్ కు తెలుసు
ఆయన తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని స్వయంగా చెప్పారని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఒక నాయకుడు వెళ్లిపోతే మళ్ళీ నాయకులను ఏ విధంగా తయారు చేసుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసని ఆయన అన్నారు. ఎక్కడైనా నాయకుల మీద ఒత్తిడి ఉండడం సహజమేనని దానిని కొంతమంది తట్టుకుంటే మరి కొంతమంది తట్టుకోలేరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒక్క మనిషి పోతే రాజకీయాలేం ఆగవు
ఇక వైయస్ జగన్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత తాజా పరిణామాల మీద చర్చిస్తామని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇదే సమయంలో గతంలో సీఎం చంద్రబాబు మీద నమ్మకం లేక రాజ్యసభ సభ్యులు పార్టీలే మారారని గుర్తు చేశారు. చంద్రబాబు దావోస్ వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చారని ఎద్దేవా చేశారు. ఒక మనిషి లేకపోయినంత మాత్రాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఆగబోదని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+