గోల్డ్ మెడలిస్ట్ రాహుల్‌కు...బంపర్ ఆఫర్ ఇచ్చిన గుంటూరు జిల్లా కలెక్టర్

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడపోటీల్లో పవర్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించి భారత దేశ కీర్తిని ఇనుమడింపజేసిన గుంటూరు జిల్లా క్రీడాకారుడు రాగాల వెంకట రాహుల్ ను వరుస ప్రోత్సాహకాలు వరిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ రాహుల్ కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు.

రాహుల్ ఎక్కడ కోరుకొంటే అక్కడ 500 చదరపు గజాల నివాస స్థలాన్ని కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ ప్రకటించారు.సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాహుల్‌ జిల్లాకు తిరిగిరాగానే తామంతా వెళ్లి ఘనంగా సత్క రిస్తామని కలెక్టర్ కోన శశిధర్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ నజరానాతో పాటు రాహుల్‌ కు ప్రభుత్వం ప్రకటించిన అన్ని ప్రోత్సాహకాలను అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.

 Guntur District Collector Bumper Offer to Gold Medalist Rahul

గ్రామీణ ప్రాంతంలోని ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి రాహుల్‌ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. రాహుల్‌ లాంటి మరెంతోమంది క్రీడాకారులు గుంటూరు జిల్లాలో తయారు కావాలని, ఇందుకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు. ఇటీవలే రాహుల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నజరానాలు ప్రకటించిన నేపథ్యంలో, ఈ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రోత్సాహకాలను ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guntur district collector Kona Sashidhar gave a bumper offer to Guntur district powerlifter Rangala Venkata Rahul. Where Rahul desires in the district he would give a 500 yards of residential plot, said Collector.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి