వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిత్రులుగా కొనసాగలేం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వైసీపీ ఉందనుకొంటున్నారా?: గల్లా సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Galla Jayadev Lok Sabha Speech : Bahubali Collection More Than Budget Funds

అమరావతి: ఏపీ ప్రజలను పూల్స్ కారని, ప్రతీసారీ ఏపీ ప్రజలను మోసం చేయలేరని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే రకంగా నిధుల కేటాయింపు కొనసాగితే మిత్రులుగా కొనసాగడం కష్టమని గల్లా జయదేవ్ ప్రకటించారు.ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బిజెపి ఒక్క రూపాయి ఇవ్వదు, టైమ్ పాస్ చేస్తోంది, కాంగ్రెస్‌కు పట్టిన గతే: రాయపాటి సంచలనంబిజెపి ఒక్క రూపాయి ఇవ్వదు, టైమ్ పాస్ చేస్తోంది, కాంగ్రెస్‌కు పట్టిన గతే: రాయపాటి సంచలనం

ఏపీకి నిధులను కేటాయించాలని టిడిపి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలు కొనసాగిస్తున్నారు.అయితే బుదవారం సాయంత్రం ఏపీకి చెందిన టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'బిజెపితో దోస్తీపై తీవ్ర నిర్ణయం తప్పదు', 'అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు''బిజెపితో దోస్తీపై తీవ్ర నిర్ణయం తప్పదు', 'అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు'

దుష్టశక్తులున్నాయి, టిడిపి దయతో ఎమ్మెల్సీని కాలేదు: సోము వీర్రాజు సంచలనందుష్టశక్తులున్నాయి, టిడిపి దయతో ఎమ్మెల్సీని కాలేదు: సోము వీర్రాజు సంచలనం

ఏపీకి నిధుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానంపై గల్లా జయదేవ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జయదేవ్ ఏపీకి జరిగిన అన్యాయంపై సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఏపీ ప్రజలు పిచ్చోళ్ళు కారు

ఏపీ ప్రజలు పిచ్చోళ్ళు కారు

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చని విషయాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అంశాలవారీగా తన ప్రసంగంలో ప్రస్తావించారు. విభజన చట్టంలోని 19 అంశాల్లో ఒక్క హమీని కూడ నెరవేర్చలేదని గల్లా జయదేవ్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కేటాయిస్తోందని చెప్పారు.ఏపీ ప్రజలు పిచ్చోళ్ళు కాదని గల్లా జయదేవ్ చెప్పారు. కానీ, అదే సమయంలో ప్రతీసారి ఏపీ ప్రజలను మోసం చేయలేరని గల్లా జయదేవ్ ప్రకటించారు.

మిత్రులుగా కొనసాగడం కష్టం

మిత్రులుగా కొనసాగడం కష్టం


ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే మిత్రులుగా కొనసాగడం కష్టమేనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌ వేదికగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టమేనని గల్లా జయదేవ్ ప్రకటించారు.విభజన హమీల్లో ఒక్కటి కూడ అమలు కాలేదన్నారు. కేంద్రానికి నివేదికలు ఇవ్వలేదని చెప్పడం సరైందికాదన్నారు. ప్రతి నివేదికను కేంద్రానికి సమర్పించినట్టు గల్లా జయదేవ్ ప్రకటించారు.

టిడిపి కాకపోతే వైసీపీ ఉందనుకొంటున్నారు

టిడిపి కాకపోతే వైసీపీ ఉందనుకొంటున్నారు

ఏపీ రాష్ట్రంలో టిడిపి కాకపోతే వైసీపీ ఉందని భావిస్తున్నారేమోనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. వైసీపీ అవినీతి పార్టీ అని గల్లా జయదేవ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు అవినీతి కేసుల నుండి తప్పించుకొనేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని గల్లా జయదేవ్ చెప్పారు. ఈ కారణంగానే టిడిపి కాకపోతే వైసీపీ ఉందని కేంద్రం భావిస్తున్నట్టు కన్పిస్తోందని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలి

ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలి


ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని రెండేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కానీ ప్రత్యేక ప్యాకేజీలో ప్రకటించిన అంశాలను అమలు చేయలేదన్నారు. తక్షణమే ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్రంలోని మెట్రో రైల్ ప్రాజెక్టులను విస్మరించారని గల్లా జయదేవ్ గుర్తు చేశారు. మరో వైపు ఇతర రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులను కేటాయించిన విషయాన్ని గల్లా జయదేవ్ గుర్తు చేశారు. ఏపీకి నిధుల కేటాయింపుపై ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి సమగ్రమైన వివరణ ఇవ్వాలని గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.

English summary
Guntur Mp Galla Jayadev sensational comments on BJP in Loksabha on Wednesday. Galla Jayadev was participated discussion on Wednesday in Loksabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X