గుంటూరులో టీడీపీకి కొమ్ము కాస్తున్న ఆ పోలీసు అధికారి ? పిన్నెల్లి వీడియో రిలీజ్ వెనుక...!
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో చేసిన ఈవీఎం ధ్వంసం వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే పోలింగ్ జరిగిన వారం రోజుల తర్వాత ఈ ఘటన బయటపడటం వెనుక వెబ్ క్యాస్ట్ లో రికార్డ్ అయిన వీడియో కీలకంగా మారింది. దీంతో ఈ వీడియోను ఈసీ విడుదల చేసిందని తొలుత అంతా భావించారు. కానీ గుంటూరుకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి వీడియోను లీక్ చేశారని సమాచారం. టీడీపీకి మద్దతుగా ఉన్న ఆ అధికారి వల్లే ఈ వీడియో బయటపడిందన్న ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సదరు పోలీసు ఉన్నతాధికారికి టీడీపీకి అనుకూలుడుగా ముద్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనే పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అ తర్వాత ఆయనే ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటన వీడియోను సైతం వెబ్ క్యాస్ట్ నుంచి తీసుకుని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో ముందుగా జరిగిన రిగ్గింగ్ ను దాచేసి ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన పార్ట్ ను మాత్రమే వ్యూహాత్మకంగా ఆయన విడుదల చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 6 చోట్ల ఈవీఎం విధ్వంసం ఘటనలు చోటు చేసుకున్నాయి. పాల్వాయి గేటులో ఒకటి, తూమ్రకోటలో 3, జట్టిపాలెం, ఒప్పిచర్లలోనూ ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి. మొత్తం ఐదు చోట్ల టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేశారు. అయితే పాల్వాయి గేట్ వీడియోను మాత్రమే సదరు అధికారి లీక్ చేసినట్లు సమాచారం.
దీంతో ఈసీ చేతుుల్లో ఉండాల్సిన ఈ వెబ్ క్యాస్ట్ వీడియో టీడీపీ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.దీనివెనుక సదరు గుంటూరు పోలీసు ఉన్నతాధికారి హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ రోజున పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహిరించిన ఆ పోలీసు ఉన్నతాధికారి.. వైసీపీ బలంగా ఉన్నచోట్ల పోలింగ్ ను ప్రభావితం చేసేలా వ్యవహరించినట్లు స్థానికంగా ఆరోపిస్తున్నారు.
అవసరంలేని ప్రాంతాల్లో బందోబస్తు పెట్టి టీడీపీ గొడవలకు వత్తాసు పలికారని, తద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను భయభ్రాంతులకు గురిచేసి వారి ఓట్లు పడనీయకుండా పన్నాగం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు టీడీపీ అభ్యర్థికోసం రిగ్గింగ్ కు వత్తాసు పలికారని కూడా తెలుస్తోంది. ఎన్నికల అక్రమాలపై వైసీపీ అభ్యర్థి ఫోన్లు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. బందోబస్తు అవసరమని పదేపదే కోరినా స్పందించలేదని తెలిసింది.
న్యూట్రల్ ముసుగులో మాచర్ల టౌన్ సీఐ, కారెంపూడి సీఐలపై ఫిర్యాదులు చేస్తూ టీడీపీ నేత వర్లరామయ్య ఇచ్చిన లేఖ ఆధారంగా సదరు అధికారి చర్యలు తీసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వెనువెంటనే మాచెర్ల టౌన్ సీఐ శరత్బాబు, కారెంపూడి సీఐ చిన మల్లయ్యల బదిలీ చేపట్టారని తెలుస్తోంది. శరత్ బాబు స్థానంలో కోటేశ్వర్రావు, చిన మల్లయ్య స్థానంలో టీడీపీ అనుకూల సామాజిక వర్గానికి చెందిన నారాయణ స్వామిని నియమించినట్లు తెలుస్తోంది. వీరి రాకతో మాచర్లలో
పరిస్ధితులు మరింతగా దిగజారాయి.












Click it and Unblock the Notifications