ఎన్ఐటీలో సీటు: ఫీజు కట్టే స్థోమత లేదు, ఆదుకోండంటూ వేడుకుంటున్నాడు
గుంటూరు: నిరుపేద కుటుంబంలో పుట్టినా చదువులో రాణించాడు. తాజాగా నిర్వహించిన గేట్ ఎగ్జామ్‌లో 6124 ర్యాంకు తెచ్చుకుని ఎన్‌ఐటీలో ఎంటెక్ (సివిల్ ఇంజనీరింగ్) సీటు సంపాదించాడు. కానీ... కోర్సులో చేరేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. దాతలెవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన ముక్కంటి వీరబ్రహ్మం అనే యువకుడికి గేట్ ర్యాంకు ఆధారంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎన్‌ఐటీలో ఎంటెక్ సీటు లభించింది. జులై 23 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. నాలుగు సెమిస్టర్లకు(రెండేళ్లకు) గాను కోర్సు ఫీజు రూ. 3.2 లక్షలు అవుతుంది.

తొలుత కోర్సులో చేరేందుకు రూ. 80వేల డీడీని ఇస్తేనే వీరబ్రహ్మంను కాలేజీలో చేర్చుకుంటారు. నిరుపేదకుటుంబంలో పుట్టడం వల్ల వీరబ్రహ్మం ఆర్ధిక పరిస్ధితి మరింత దయనీయంగా ఉంది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న వీరబ్రహ్మం తండ్రి కోటేశ్వరరావుకు ఫీజు కట్టే స్థోమత లేదు.
దీంతో ఎవరైనా దాతులు సహకరిస్తే, తన ఎంటెక్‌ను పూర్తి చేస్తానని అంటున్నాడు. ఈ సరస్వతీ పుత్రుడికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నరసరావు పేట ప్రకాష్ నగర్ ఎస్‌బీఐ ఏడీబీ బ్రాంచ్ ఖాతా నెంబరు: 20217665676లో డబ్బు జమ చేయాలని వేడుకుంటున్నాడు.
దాతలు 96662 42143కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications