హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిడ్స్: గుంటూరు టాప్, గర్భిణీల జిల్లాగా పాలమూరు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎయిడ్స్ రోగులు అత్యధికంగా గల జిల్లాగా గుంటూరు జిల్లా మొదటి స్ధానంలో ఉందని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తన నివేదికను వెల్లడించింది. 2013 -14 ఏడాదిలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 5,195 ఎయిడ్స్ కేసులు నమోదు కాగా వారిలో 2,498 మహిళలు ఉన్నారని పేర్కొంది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

అంతక ముందు ఏడాది 6,027 కేసులు నమోదు అయ్యాయని పేర్కొంది. ఆ తర్వాతి స్ధానాల్లో వరుసగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, హైదరాబాద్, విశాఖపట్నం, చిత్తూరు, నల్గొండ, నెల్లూరు, కడప, మహబూబ్నగర్, అనంతపురం, ప్రకాశం, ఖమ్మం, కర్నూలు, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ , శ్రీకాకుళం, విజయనగరం, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి.

Guntur tops the list of HIV positive cases in Andhra Pradesh

ఇది ఇలా ఉంటే... తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలు జాతీయ రహదారికి అనుకుని ఉన్నాయని... ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలలో హెచ్ఐవీ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. విభజనకు ముందే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గత రెండేళ్ల నుంచి గుంటూరు మొదటి స్ధానంలో కొనసాగిన విషయాన్ని గుర్తు చేసింది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఎయిడ్స్ రోగుల జాబితాలో మొదటి స్ధానంలో ఉందని పేర్కొంది. నగరంలో మొత్తం మీద హెచ్ఐవీ రోగులు ఉండగా వారిలో 2,525 మంది మహిళలు ఉన్నారని పేర్కొంది. ఇక అత్యధిక గర్భిణీలకు ఎయిడ్స్ వ్యాధి సోకిన జిల్లాగా మహబూబ్ నగర్ నమోదైనట్లు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తన నివేదికలో పేర్కొంది.

English summary
Guntur district, which forms part of the AP state capital region, tops the list of HIV positive cases in the state. The district also had the dubious distinction of being the "HIV capital' in undivided Andhra Pradesh in the last two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X