గుంటూరు:ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య...కలకలం
గుంటూరు:జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. ఈ రెండు హత్యలు గుంటూరు నగరానికి సమీపంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.
ఒక ఘటనలో దుండగులు ఒక వ్యక్తిని బండరాళ్లతో కొట్టి చంపగా, మరొకరిని గొంతుకోసి హత్య చేశారు. గుంటూరు నగర శివారులోని వెంగళాయపాలెంలో శివుడు నాయక్ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు ఈ విధంగా బండరాళ్లతో మోది దారుణంగా హతమార్చారు. మరోవైపు గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్లే మార్గంలోని ఫిరంగిపురంలో సీపూ అనే చిరువ్యాపారిని అగంతకులు గొంతుకోసి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే...

గుంటూరు మిర్చి యార్డ్ లో ముఠా కూలీగా పని చేసే శివుడు నాయక్ అనే వ్యక్తిని వెంగళాయపాలెంలో కొందరు దుండగులు బండరాళ్లతో మోది నాయక్‌ను హత్య చేశారు. అయితే శివుడు నాయక్‌ను ఒక మాజీ రౌడీషీటర్ పాత కక్ష్యత నేపథ్యంలో హత్య చేసివుండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరోవైపు ఫిరంగిపురం రామాలయం వీధిలో పానీపూరి అమ్మకునే సీపూ అనే యువకుడిని అగంతకులు హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సీపూ అనే యువకుడిని గొంతు కోసి దారుణంగా హతమార్చారు. హతుడు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం జోహాన్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య అతడికి తెలిసినవారిపనే అయిఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications