కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీఆర్వో పరీక్షల్లో కాపీయింగ్ యత్నం: గురివిరెడ్డి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

Kurnool
కర్నూలు: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగబోయే వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌‌కు ప్రయత్నించిన గురివిరెడ్డి ముఠా గుట్టురట్టయింది. మాస్ కాపీయింగ్ కోసం గురవిరెడ్డి ముఠా పన్నిన కుట్రను పోలీసులు శనివారం కర్నూలు జిల్లాలో భగ్నం చేశారు. గురివిరెడ్డితోపాటు మరో ఐదుగురు నిందితులను కర్నూలు జిల్లా పోలీసులు ఎంతో చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

నంద్యాలలో మకాం వేసిన గురివిరెడ్డి ముఠా మాస్ కాపీయింగ్‌కు ఇక్కడి నుంచే ప్రణాళిక వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుట్రను అమలు చేసేందుకు చాలా మందితో గురివిరెడ్డి ముఠా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. శాంతిరాం మెడికల్ కాలేజీలో చదవిని గురివిరెడ్డి ముఠా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నాడు. మాస్ కాపీయింగ్ కోసం అభ్యర్థులకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థులకు జొన్న గింజ అంత పరిమాణంలో ఉన్న కెమారాను అందించి, వారి షర్ట్ బటన్‌కు అమర్చుకునేలా శిక్షణ ఇస్తారు. ఇందుకోసం మహిళల కోసం ప్రత్యేకమైన పంజాబీ డ్రెస్సులు, పురుషులకు టీ షర్టులు రూపొందించారు. అంతేగాక వారికి బ్లూటూత్‌ను అందజేసి దాని ద్వారా సమాధానాలు చెబుతారు.

రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రతీ పరీక్షలో మాస్ కాపీయింగ్ పాల్పడుతుండటంతో పోలీసులు నిఘా పెట్టి గురివిరెడ్డి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పది మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల దగ్గర్నుంచి ప్రత్యేక టీషర్టులు, స్మార్ట్ ఫోన్లు, పలు ఆధునిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. గురివిరెడ్డి ముఠా గతంలో కూడా ఎంబిబిఎస్, మెడికల్ పీజీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడింది.

English summary
Gurivi Reddy mass copying gang arrested in Nandyala in Kurnool district on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X