అందుకే బిజెపికి జగన్, చంద్రబాబుల సంకేతాలు: గుత్తా

ఆయన నల్గొండ జిల్లాలో మాట్లాడారు. సెక్యులరిజాన్ని తుంగలో తొక్కి అవకాశవాద రాజకీయాలకు జగన్, చంద్రబాబులు తెరలేపారన్నారు. భవిష్యత్తులో ఇక బిజెపితో పొత్తు ఉండదని చెప్పిన చంద్రబాబు గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఎళా మిత్రుడయ్యారన్నారు.
తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకే వారు బిజెపితో కలిసే ప్రయత్నాలు చేస్తున్నారని కానీ, వారి ఆశలు నెరవేరవన్నారు. కాంగ్రెసు పార్టీ లేకుండే వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయి ఉండేవారని, వైయస్ లేకుండా వైయస్ జగన్ లేరని గుత్తా మండిపడ్డారు.
కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తుందన్నారు. అందుకే వడివడిగా అడుగులు వేస్తోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తున్నందున తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణవాదులు తమ పార్టీకి అండగా ఉండాలని కోరారు.












Click it and Unblock the Notifications