మేం విలన్లం, మీరు హీరోలా: గుత్తా, బాబుపై ఫైర్
నల్గొండ: పార్లమెంటులో పెప్పర్‌స్ప్రే ప్రయోగించి పార్లమెంటు సభ్యులను ఇబ్బందులకు గురిచేసిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటిని భగత్ సింగ్‌తో పోల్చడం సిగ్గుచేటని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఎంపీలను విలన్లుగా చూపించి, .సీమాంధ్ర ఎంపీలను హీరోలుగా చూపించడం తగదన్నారు. పక్షపాత ధోరణి మాని వాస్తవాలను ప్రజలకు చూపించాలని ఆయన అన్నారు. సమన్యాయం అంటే ఏమిటో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ప్రక్రియ ఆగిపోతే మొదటి ముద్దాయి చంద్రబాబు అవుతారని, రెండో ముద్దాయి బిజెపి అవుతుందని ఎంపీ గుత్తా సుఖేంధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లగడపాటి రాజగోపాల్‌ను ఆంధ్ర భగత్‌సింగ్‌గా అభివర్ణించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. పార్లమెంటులో తెలుగువారి పరువు తీసిన లగడపాటిని భగత్ సింగ్‌తో పోల్చడమేమిటని ఆయన అడిగారు.
పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టి ఎంపిలను హత్య చేయడానికి ప్రయత్నించిన లగడపాటిపై జీవితకాలం నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో సీమాంధ్ర ఎంపిల అనుచిత ప్రవర్తనను చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఖండించలేదని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications