చెప్పడం తప్ప చేసిందేమీ లేదు: జగన్‌పై నిప్పులు చెరిగిన టీడీపీ నేత
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు.
నాడు పేదలకు వెయ్యి రూపాయల పింఛన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. విశ్వసనీయతకు మారుపేరు అని ఊదరగొట్టుకోవడం తప్ప ప్రజల కోసం జగన్ చేసిందీ ఏదీ లేదన్నారు.

రాష్ట్రంలో ఇప్పుడు పేదల రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతి నెల 48 లక్షల మందికి క్రమం తప్పకుండా రూ.వెయ్యి చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
చంద్రన్న బీమా బాధిత పేదలకు వరమని, ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి చేయూతగా రూ.5 లక్షల బీమా చెల్లిస్తున్నట్లు చెప్పారు అర్హత ఉందని ఇంకా అందని వారు వచ్చే నెలలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications