రాజీనామా, చంద్రబాబు పై జీవీ రెడ్డి సంచలన ట్వీట్..!!

రాజీనామా తరువాత జీవీ రెడ్డి తొలి సారి స్పందించారు. ఫైబర్ నెట్ ఛైర్మన్ గా సంస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన జీవీ రెడ్డి ఓపెన్ గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆ తరువాత సీఎం చంద్రబాబు ను జీవీ రెడ్డి కలిసారు. తన పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేయటం తో పాటుగా టీడీపీని వీడుతూ.. ఇక, రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. జీవీ రెడ్డి రాజీ నామా పైన టీడీపీ కేడర్ నుంచి అనూహ్య స్పందన కనిపించింది. కేడర్ జీవీ రెడ్డికి మద్దతుగా నిలి చింది. ఇక, ఇప్పుడు జీవీ రెడ్డి తొలి సారిగా స్పందిస్తూ చంద్రబాబు పై తన అభిప్రాయం ఏంటో తేల్చి చెప్పారు.

రాజీనామా తరువాత
జీవీ రెడ్డి ఇప్పుడు టీడీపీ కేడర్ కు అభిమాన నాయకుడిగా మారిపోయారు. ఫైబర్ నెట్ లో అక్కడి ఎండీ తన మాట లెక్క చేయకపోవటం.. సంస్థలో సంస్కరణలకు సహకరించకపోవటం పైన జీవీ రెడ్డి సీరియస్ అయ్యారు. కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో, చంద్రబాబు ఆ తరహా వ్యాఖ్యల పైన జీవీ రెడ్డిని మందలించినట్లు ప్రచారం సాగింది. ఆ తరువాత జీవీ రెడ్డి తన పదవికి.. పార్టీకి రాజీ నామా చేసారు. వెంటనే పార్టీ నాయకత్వం రాజీనామా ఆమోదించింది. అదే సమయంలో ఐఏఎస్ దినేశ్ ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. జీవీ రెడ్డి రాజీనామా ఆమోదించటం పైన పార్టీ కేడర్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది.

GV Reddy First Reactions after his Resignation as Fibernet Chairman Goes viral

తొలి స్పందన
వైసీపీ పైన పార్టీ నేతగా పోరాటం చేస్తూ.. సంస్థలో లోపాలను ప్రస్తావించినందుకు జీవీ రెడ్డి పైన చర్యలు తీసుకోవటం ఏంటని పార్టీ నాయకత్వాన్ని కేడర్ నిలదీసింది. తిరిగి జీవీ రెడ్డి పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. ఇక, ఇప్పుడు రాజీనామా తరువాత జీవీ రెడ్డి తొలి సారి స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేసారు. అందులో ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. జీవీ రెడ్డి తన ట్వీట్ లో.."నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల బారి బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది.." అని తేల్చి చెప్పారు.

ట్వీట్ వైరల్
దీనికి కొనసాగింపుగా.." తక్కువ కాలంలోనే టీడీపీ లోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి . రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత..." అంటూ జీవీ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. జీవీ రెడ్డి సీఎం చంద్రబాబు పైన ఇంకా భక్తి భావం చాటుకోవటాన్ని టీడీపీ కేడర్ ప్రశంసిస్తోంది. పార్టీలోకి తిరిగి రావాలని కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+