అరుదైన 'త్రిగ్రాహి రాజయోగం'తో ఈ నెల 22 నుంచి ఈ 3 రాశులకు కుబేర యోగం!
గ్రహాల సంచారం, కలయిక మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే జూన్ నెలలో ఒక అత్యంత శక్తివంతమైన, అరుదైన ఖగోళ సంయోగం జరగబోతోంది. జూన్ 22వ తేదీన కర్కాటక రాశిలో 'త్రిగ్రహి రాజయోగం' ఏర్పడుతోంది. చాలా కాలం తర్వాత ఏర్పడుతున్న ఈ శక్తివంతమైన యోగం కారణంగా.. ముఖ్యంగా 3 రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. జూన్ 22 నుంచి వీరికి తిరుగులేదని, ఆర్థికంగా ఊహించని ధనలాభాలు కలిగి కుబేరులు కాబోతున్నారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మీన రాశి వారికి అదృష్టం
మీన రాశి వారికి ఈ రాజయోగం అదృష్టాన్ని అయాచితంగా తెచ్చిపెట్టబోతోంది. గత కొంతకాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక కుటుంబ సమస్యలన్నీ ఈ సమయంలో సమసిపోతాయి. ఉద్యోగం చేసే వారికి పని ప్రదేశంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. చాలా కాలంగా కోరుకుంటున్న ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరి మానసిక ప్రశాంతత దక్కుతుంది.

వృషభ రాశి వారికి పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు
త్రిగ్రహి రాజయోగం వల్ల వృషభ రాశి వారికి అత్యంత ఫలప్రదమైన కాలం మొదలుకానుంది. బుధుడి శుభ ప్రభావం వల్ల వీరి సంభాషణ చాతుర్యం, మాట్లాడే నైపుణ్యం విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పదోన్నతులు లభించడంతో పాటు జీతాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. క్లిష్ట సమయాల్లోనూ ధైర్యంగా సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా పుంజుకుంటాయి.
కర్కాటక రాశి వారికి సువర్ణ యుగం
ఈ త్రిగ్రహి రాజయోగం కర్కాటక రాశిలోనే ఏర్పడుతుండటంతో, ఈ రాశిలో జన్మించిన వారికి ఇది ఒక 'సువర్ణ యుగం' అని చెప్పవచ్చు. వీరు ఏ పని చేపట్టినా అందులో లాభాలే కనిపిస్తాయి. గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతికి అందుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారికి భారీగా లాభాలు వచ్చి, బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. మీడియా, రచన, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం అత్యంత అనుకూలం. కార్యాలయంలో అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా తలుపు తడతాయి.












Click it and Unblock the Notifications