ఒంటరిగా ఉన్నప్పుడు సడెన్‌గా కారవాన్‌లోకి వచ్చి బట్టలిప్పేశాడు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అభిమానుల గుండెల్లో చందమామగా ముద్రవేసుకున్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పెళ్లి చేసుకుని ఇప్పుడు కాస్త సైలెంట్ అయిన ఈ అందాల భామ.. టాలీవుడ్ లో చేసిన రచ్చ అంత ఇంతా కాదు. 2007లో డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మగధీర, డార్లింగ్, బిజినెస్‌మెన్ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో తన క్రేజ్ ఏంటో నిరూపించుకుంది. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి నటిగా అగ్రస్థానాన్ని కూడా అందుకుంది. కాజల్ ప్రస్తుతం తన వయసు ఇమేజ్ కు తగ్గట్లుగా సినిమాలు చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ అభిమాని కారణంగా ఎదురైన భయానక సంఘటనను బయటపెట్టారు కాజల్ అగర్వాల్. ఆ సమయంలో భయంతో వణికిపోయానని కాజల్ పేర్కొన్నారు.

ఓ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఓ దిగ్భ్రాంతికర చేదు అనుభవాన్ని కాజల్ బయటపెట్టింది. కాజల్ మాట్లాడుతూ.. "కొద్ది రోజుల క్రితం ఓ సినిమా సెట్లో షూటింగ్ పూర్తయిన అనంతరం కారవాన్ లో రెస్ట్ తీసుకుంటున్నాను. ఆ సమయంలో ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా నా కారవాన్ లోకి ప్రవేశించాడు. అతడు వెంటనే తన చొక్కా విప్పేసి ఛాతిపై నా పేరుతో వేయించుకున్న టాటూను చూపించాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటనతో ఒక్కసారిగా నా కాళ్లు చేతులు వణికిపోయాయి" అని కాజల్ అగర్వాల్ వెల్లడించింది.

Kajal Aggarwal Recalls Shocking Incident Assistant Director Entered Caravan Without Permission

ఆ వ్యక్తి ప్రవర్తనపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. "నా పేరును టాటూగా వేయించుకున్నందుకు సంతోషంగానే అనిపించింది. కానీ ఓ మహిళ ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి ఎలాంటి అనుమతి తీసుకోకుండా రావడం ఏ మాత్రం సరైన పద్ధతి కాదు. ఎంత అభిమాని అయినా అలా ప్రవర్తించడం సరికాదు. ఇలా చేస్తే క్రిమినల్ చర్య అవుతుందని హెచ్చరించి పంపించేశాను" అంటూ కాజల్ అగర్వాల్ వివరించింది. ఈ ఘటన గురించి కాజల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+