భోగాపురం ఎయిర్ పోర్ట్.. రీల్స్, స్లోగన్స్ పోటీలు.. లక్షల బహుమతులు!
విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం అవుతోంది. ఈ చారిత్రాత్మక సందర్భంలో ఏపీ ప్రజలను ఇందులో భాగస్వాములను చేసేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మొన్నటికి మొన్న భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, తాజాగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి ప్రత్యేక రీల్స్ పోటీ నిర్వహిస్తున్నారు.
30సెకన్ల రీల్ రూపొందించి పోస్ట్ చెయ్యాలని ఆహ్వానం
భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి 30సెకన్ల రీల్ రూపొందించి పోస్ట్ చెయ్యాలని ప్రజలకు ప్రభుత్వం ఆహ్వానించింది. సెల్ఫీ రీల్ లేదా కుటుంబసభ్యులతో, లేదా స్నేహితులతో కలిసి గ్రూప్ రీల్ చేయవచ్చు. ఈ రీల్ లో విమానాశ్రయం గురించి మీ భావాలు, మీ సందేశాలు, ఆశలు వ్యక్తం చెయ్యాలి. జులై 29లోపు వ్యక్తిగత ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చెయ్యాలి. పోస్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా @apofficialnews ను ట్యాగ్ చెయ్యాలి.

రీల్స్ పోటీలతో పాటు స్లోగన్ పోటీలు
అలాగే #asrinternationalairport, #uttarandhrakalalaku rekkalu హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించాలి. క్రియేటివిటీ, సందేశం, ప్రభావం, ప్రజాదరణ వంటి అంశాల ఆధారంగా ఐదు రీల్స్ ని ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అందజేస్తారు. యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించటం, విమానాశ్రయం గురించి విస్తృత ప్రచారం చేయటం ఈ పోటీ లక్ష్యం. రీల్స్ పోటీ మాత్రమే కాదు విమానాశ్రయానికి సంబంధించి స్లోగన్ పోటీలు కూడా నిర్వహించారు.
ఉత్తమ స్లోగన్ కు లక్ష రూపాయల బహుమతి
విజయనగరం జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగులో ఆకట్టుకునేలా స్లోగన్ రాయాలని ఆహ్వానించారు. ఈ స్లోగన్ రైటింగ్ లో ఆరో తరగతి నుండి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. ఉత్తమ స్లోగన్ కు లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నారు. స్లోగన్ తో పాటు పేరు చిరునామా, చదువు, మొబైల్ నెంబర్ వివరాలను airportslogan@gmail. com కు పంపాలని పేర్కొన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ కౌంట్ డౌన్ వేళ సృజనకు పట్టం
మెయిల్ కు కాకుంటే 9440749687వాట్సప్ నెంబర్ కు పంపాలని సూచించారు. అయితే ఇప్పటికే భారీగా యువత ఈ పోటీలలో పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా కౌంట్ డౌన్ నిర్వహిస్తూ ఈ తరహా కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications