బండ్లు అవుట్: రాజుకున్న నిప్పు- కేంద్రానికి సెగ: ఈ నంబర్ కు వాట్సప్ చేస్తే

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న ఇథనాల్ పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి సమాయత్తమవుతోంది. ఈ వివాదాస్పద నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే, దేశవ్యాప్తంగా నిరసనలను ఉధృతం చేస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత కార్యాచరణను ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

ఈ20 పెట్రోల్ వాడకం వల్ల దేశంలోని కోట్లాది మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. దీని ప్రభావంతో వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయని, కారు, బైక్ లల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్స్ కు గురి అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జేబులకు చిల్లు పడుతున్న ఈ సమస్యపై కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Kejriwal launches National Townhall Against E20 and urged to join online send a WhatsApp message

ఇథనాల్ వల్ల ఎదురవుతున్న సమస్యలపై దేశవ్యాప్తంగా పౌరులు తమ గళాన్ని వినిపించడానికి ఆప్ ఈ శనివారం నేషనల్ టౌన్‌హాల్ ఎగైనెస్ట్ ఈ20 పేరిట ఓ సదస్సును నిర్వహిస్తోంది. ఈ జాతీయ స్థాయి చర్చావేదికలో బాధితులు, వాహనదారులు తమ అనుభవాలను పంచుకోవచ్చని కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్ ద్వారా జాయిన్ కావాలని, 8588833212 నంబర్ కు వాట్సప్ మెసేజ్ పెడితే మీటింగ్ లింక్ ను పంపిస్తామని అన్నారు.

ఈ టౌన్ హాల్ మీటింగ్.. చర్చలకు మాత్రమే పరిమితం కాబోదని కేజ్రీవాల్ అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానంపై దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపడతామని, ఆ పిటిషన్‌ను వచ్చే వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి పంపిస్తామని ఆయన తెలిపారు. యువత అంతా ఏకతాటిపైకి వచ్చి గళమెత్తడం వల్లే కేంద్ర పరీక్షల లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని, అదే విధంగా ఈ20 అంశంపై కూడా అందరూ కలిసికట్టుగా పోరాడాలని అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

కాలుష్య నియంత్రణ పేరుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ లో ఇథనాల్ బ్లెండింగ్‌ను వేగవంతం చేస్తోంది. అవసరమైన ఇంజిన్ మార్పులు లేకుండానే సాధారణ వాహనాల్లో ఈ ఇంధనాన్ని వాడటం వల్ల ఇంజిన్ భాగాలు త్వరగా తుప్పుపట్టడం, మైలేజీ తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయలేని పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం శాపంగా మారిందని ఆప్ విమర్శిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+