రేవంత్ అనూహ్య నిర్ణయం, బిగ్ టర్న్- కేసీఆర్ వాట్ నెక్స్ట్..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాలు రాష్ట్ర రాజకీయం పైనా ప్రభావం చూపుతున్నాయి. కాక్రోచ్ పార్టీ.. యువత ఢిల్లీ కేంద్రంగా చేసిన ధర్నాలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ నిరసన నిర్వహించింది. కాగా.. ఇప్పుడు యువతను తమ వైపు తిప్పుకునేందుకు కొత్త రాజకీయ వ్యూహాలు సీఎం రేవంత్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. మాజీ సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

తెలంగాణ కేంద్రంగా రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్నాయి. జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్న పరిణామాలతో పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. అందులో భాగంగా యువతకు మద్దతుగా కాంగ్రెస్ కొత్త నిర్ణయాలకు సిద్దమైంది. తాగాజా ఢిల్లీలో నిరసనలు.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాంగ్రెస్ యువతను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో యువతకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీచేసే వారి కనీస వయోపరిమితిని 25 ఏండ్ల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ తమ ప్రభుత్వంలో యువతకు ప్రాధాన్యత దక్కేలా తాను చొరవ తీసుకుంటానని రేవంత్ హామీ ఇస్తున్నారు.

telangana-govt-all-set-to-conduct-monsoon-assembly-sessions-from-17-august-likely-to-introduce-key

అసెంబ్లీ సమావేశాల వేదికగా

ఈ మేరకు యువతకు ఎన్నికల్లో పోటీ చేసే వయసు తగ్గిస్తూ అసెంబ్లీ లో తీర్మానం దిశగా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారు చేసింది. ఆగస్టు 17నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కనీసం వారం రోజులపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఈ సమావేశాల్లో మరికొన్ని తీర్మానాలు, బిల్లులు పెట్టే అవకాశం ఉన్నది. శాసనసభ, శాసనమండలిలో ఆధునీక రించిన భవన సముదాయాలను సీఎం రేవంత్‌ ఆగస్టులో ప్రారంభించనున్నారు. అసెంబ్లీ సెంట్రల్‌ హాల్‌ సహా మంత్రుల చాంబర్ల పునర్నిర్మాణ పనులను ఆగస్టు 10లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. అయితే, యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని రేవంత్ అమలు చేస్తున్న వ్యూహాలకు మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి కౌంటర్ స్కెచ్ అమలు చేస్తారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+