PM Modi: ప్రతీ ఆదివారం 8 గంటలకు మోడీ స్పీచ్..! తేల్చేసిన కేంద్రం..!

నీట్ తో పాటు వరుసగా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాల నేపథ్యంలో కేంద్రమంత్రి ధర్మేంద్ ప్రధాన్ రాజీనామా కోసం విద్యార్ధులు రోడ్డెక్కారు. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు చేశారు. వీటి వీడియోల్ని కుప్పలుతెప్పలుగా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. దీంతో వీరిని శాంతపరిచేందుకు ప్రధాని మోడీ (PM Modi) రంగంలోకి దిగారు. విద్యార్ధులను ఉద్దేశించి ప్రతీ రోజూ అర్ధరాత్రి ఓ వీడియో చొప్పున వరుసగా మూడు రోజుల పాటు మూడు వీడియోల్ని ఇన్ స్టా గ్రామ్ ద్వారా రిలీజ్ చేశారు. తాజాగా ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం కావడంతో మోడీ తన వీడియోలకు బ్రేక్ ఇచ్చారు.

అయితే ఇన్ స్టా గ్రామ్ (Istagram) లో యువత చురుగ్గా ఉన్నారనే విషయం గ్రహించి మధ్యలో జరిగిన ఓ కేబినెట్ భేటీలో మంత్రుల్ని ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండాలని ప్రధాని మోడీ సూచించినట్లు వార్తలొచ్చాయి. అనంతరం తాను కూడా ప్రతీ ఆదివారం రాత్రి 8 గంటలకు ఇన్ స్టా ద్వారా దేశంలోని యువతతో లైవ్ లో మాట్లాడతానని ప్రధాని మోడీ చెప్పినట్లు ఓ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం తాజాగా స్పందించింది. పీఐబీ తన ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Cheack) ద్వారా దీనిపై స్పష్టత ఇచ్చింది.

PM Modi Did Not Announce Weekly Instagram Live at 8 PM on Sundays Clarifies PIB

ప్రధాని మోడీ ప్రతీ ఆదివారం రాత్రి 8 గంటలకు ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ లోకి వచ్చి వీడియో చేస్తారన్న వాదనను పీఐబీ కొట్టిపారేసింది. అదంతా ఫేక్ ప్రచారమే అని తేల్చేసింది. ప్రధాని మోడీ ఇప్పటివరకూ అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని, ప్రకటన కూడా చేయలేదని నిర్ధారించింది. వాస్తవ సమాచారం కోసం అధికారిక హ్యాండిల్స్ పై ఆధారపడాలని కూడా యూజర్లను పీఐబీ కోరింది. దీంతో ప్రధాని మోడీ ఇన్ స్టా వీడియోల ప్రచారానికి తెరపడినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+